Sun Transit 2026 : వృషభ రాశిలోకి సూర్యుడు - మరికొన్ని రోజుల్లో ఈ రాశుల వారికి ఇక రాజభోగాలే…!
మే 15న సూర్యుడు శుక్రుడి రాశియైన వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ గ్రహ మార్పు వల్ల మేష, వృషభ, మకర రాశుల వారికి అదృష్టం వరించనుంది. దీని ప్రభావం… పరిహారాల గురించి ఇక్కడ తెలుసుకోండి….
Sun transit in Taurus: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాజు సూర్య భగవానుడు మే 15న తన రాశిని మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం మేష రాశిలో ఉన్న సూర్యుడు…. మే 15వ తేదీ తర్వాత శుక్రుడికి ప్రియమైన వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, సామాజికంగా అద్భుతమైన ఫలితాలను అందించబోతోంది. ముఖ్యంగా అధిక మాసానికి ముందు జరిగే ఈ మార్పు జ్యోతిష్య రీత్యా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

మేష రాశి :
మేష రాశి వారికి సూర్యుడు రెండో ఇంట (ద్వితీయ స్థానంలో) సంచరించనున్నాడు. దీనివల్ల కుటుంబ సభ్యులతో గతంలో ఉన్న విభేదాలు తొలగి సఖ్యత పెరుగుతుంది. కుటుంబంతో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. ధన లాభం కలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఈ సమయంలో డబ్బును పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి. దీర్ఘకాలిక ప్రణాళికలతో చేసే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడతాయి. సూర్య భగవానుడి పూర్తి ఆశీస్సులు పొందాలనుకునే వారు ఆదివారం నాడు ఉపవాసం ఉండటం శ్రేయస్కరం.
వృషభ రాశి:
సూర్యుడు మీ రాశిలోనే (ప్రథమ స్థానంలో) సంచరిస్తున్నాడు. ఈ కాలం మీకు అత్యంత సానుకూలంగా ఉంటుంది. మీరు పనిచేసే ప్రతి రంగంలోనూ ప్రతిభను చాటుకుంటారు. ఇది మీకు అన్ని విధాలా కలిసివచ్చే సమయం.
వృషభ రాశిలో జన్మించిన వారు సాధారణంగా తెల్లని లేదా గోధుమ రంగు ఛాయ కలిగి ఉంటారు. వీరు దృఢమైన శరీరం, పొడవైన దంతాలు కలిగి ఉండి, అత్యంత ఓపికగా ఉంటారు. దైవభక్తి, గంభీర స్వభావం వీరి సొంతం. మధురంగా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటారు. వీరు ప్రశాంతంగా కనిపించినప్పటికీ, అవసరమైనప్పుడు యుద్ధ రంగంలోనైనా తమ పరాక్రమాన్ని ప్రదర్శించే ధైర్యశాలులు. ఆదివారం నాడు ఎర్ర గంధాన్ని ఉపయోగించడం వల్ల శుభ ఫలితాలు మరింత పెరుగుతాయి.
మకర రాశి:
మకర రాశి వారికి సూర్యుడు ఐదవ ఇంట సంచరించబోతున్నాడు. దీనివల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. మీ శృంగార జీవితం ఈ కాలంలో చాలా అద్భుతంగా ఉంటుంది. మీ భాగస్వామి మిమ్మల్ని అన్ని విధాలా సంతోషపరుస్తారు. వారి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. నిరుపేదలకు గోధుమలను దానం చేయడం వల్ల దోషాలు తొలగి శుభం కలుగుతుంది.
సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు జన్మించిన వారు సాధారణంగా తెల్లని ఛాయతో, అదృష్టవంతులుగా, ధనవంతులుగా ఉంటారు. వారు సమాజంలో మంచి గుర్తింపు పొంది, పండితులుగా లేదా ఉన్నత పదవుల్లో రాణిస్తారు. ఇప్పుడు సూర్యుడు వృషభంలోకి మారుతుండటంతో పైన పేర్కొన్న రాశుల వారికి ఆర్థికంగా గొప్ప మలుపు రాబోతోంది.
గమనిక : ఈ కథనంలో ఉన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది జ్యోతిష్య పండితుల అభిప్రాయాలు, శాస్త్రాల ఆధారంగా ఇవ్వబడింది. దీనిని పూర్తిగా నిజమని మేము ధృవీకరించడం లేదు. మరిన్ని వివరాల కోసం సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించగలరు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

