మనం నిద్రపోయినప్పుడు చాలా కలలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనం ఆ కలలను మర్చిపోతూ ఉంటాం కూడా. స్వప్నశాస్త్రం ప్రకారం కొన్ని కలలు వెనుక పరమార్థం దాగి ఉంటుంది. స్వప్నశాస్త్రం ప్రకారం ఇలాంటి కలలను శుభ సంకేతాలుగా భావించాలి. మరి స్వప్నశాస్త్రం ప్రకారం ఎలాంటి కలలు వస్తే అదృష్టం కలిసి వస్తుంది?

ఇలాంటి కలలు వస్తే మాత్రం విపరీతమైన అదృష్టం కలుగుతుంది. పైగా పెద్ద మాయ ఏదో జరగబోతుందని అర్థం చేసుకోవాలి. మరి మీకు ఎప్పుడైనా ఇలాంటి కలలు వచ్చాయా?
స్వప్నశాస్త్రం ప్రకారం ఇలాంటి కలలు వస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది
1. అందమైన పూల తోట
చాలామందికి నిద్రపోయినప్పుడు అందమైన పూల తోటలు కనపడే ఉంటాయి. అయితే కలలో ఇలా అందమైన పూల తోటలు కనపడినట్లయితే, అదృష్టం కలిసి రాబోతుందని అర్థం చేసుకోవాలి. ఎప్పటి నుంచో తీరని కోరికలు ఏ సమయంలో తీరుతాయని ఇలాంటి కలలు సూచిస్తాయి. ఇలాంటి కలలు వస్తే ఆర్థికపరంగా కూడా బాగుంటుందని అర్థం చేసుకోవాలి. సంతోషం కూడా రెట్టింపు అవుతుందట. ఈ కల వస్తే ఎవరితోనూ పంచుకోకూడదు.
2. వెండి బిందెలు
కలలో వెండి బిందెలు కనపడినట్లయితే, అదృష్టం కలిసి రాబోతుందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి కలలు వస్తే డబ్బు కలిగి సంతోషంగా ఉండగలరని, ఆర్థికపరంగా బాగుంటుందని భావిస్తారు. వ్యాపారాలు సక్సెస్ అవుతాయి. అంతేకాకుండా ఇలాంటి కలలు వస్తే లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి రాబోతోందని, దేనికి లోటు ఉండదని అర్థం చేసుకోవాలి.
3. చనిపోయినట్లు కల
ఎవరికైనా తామే చనిపోయినట్లు కల వచ్చినట్లయితే, అది అదృష్టంగా భావించాలి. ఇలాంటి కలలు కొంచెం భయంకరంగా, బాధగా ఉన్నా కూడా, ఈ కలలు అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి అని అర్థం. పాత గొడవలు, సమస్యలు అన్ని తొలగిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారని ఇలాంటి కలలు తెలిపే సంకేతాలు. ఇలాంటి కలలు వస్తే జీవితంలో పెద్ద మార్పు రాబోతోందని, కొత్త జీవితానికి స్వాగతం పలకాలని అర్థం చేసుకోవాలి.
4. మీ ముఖాన్ని మీరు అద్దంలో చూసుకోవడం
{{/usCountry}}ఎవరికైనా తామే చనిపోయినట్లు కల వచ్చినట్లయితే, అది అదృష్టంగా భావించాలి. ఇలాంటి కలలు కొంచెం భయంకరంగా, బాధగా ఉన్నా కూడా, ఈ కలలు అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి అని అర్థం. పాత గొడవలు, సమస్యలు అన్ని తొలగిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారని ఇలాంటి కలలు తెలిపే సంకేతాలు. ఇలాంటి కలలు వస్తే జీవితంలో పెద్ద మార్పు రాబోతోందని, కొత్త జీవితానికి స్వాగతం పలకాలని అర్థం చేసుకోవాలి.
4. మీ ముఖాన్ని మీరు అద్దంలో చూసుకోవడం
{{/usCountry}}మీ ముఖాన్ని మీరు అద్దంలో చూసుకుంటున్నట్లు కలలో వచ్చినట్లయితే, మీ కష్టానికి తగ్గ ఫలితం త్వరలోనే రాబోతోందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి కలలు వస్తే సక్సెస్ కూడా రాబోతోందని, కెరీర్‌లో, వ్యాపారంలో, పర్సనల్ లైఫ్‌లో కూడా బాగుంటుందని అర్థం చేసుకోవాలి. అలాగే ఇలాంటి కలలు వస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుందట.
5. కలలో లక్ష్మీదేవి
లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తే దేనికి లోటు ఉండదు. ఎప్పుడు డబ్బు కొరతే ఉండదు. కలలో లక్ష్మీదేవి కనబడితే సమస్యలు తొలగిపోతాయని అర్థం. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఉందని అర్థం చేసుకోవాలి. జీవితంలో సానుకూల మార్పులు చూడగలుగుతారు. ఇలాంటి కల వస్తే కూడా ఎవరితోనూ పంచుకోకూడదు.