...
...
Next Story

ఈ 4 రాశులకు 2026 సంక్రాంతి బాగా కలిసి వస్తుంది.. మహాలక్ష్మీ రాజయోగంతో డబ్బు, విపరీతమైన అదృష్టం, ఆనందంతో పాటు ఎన్నో

కొత్త సంవత్సరం కుజుడు ధనుస్సు నుంచి మకరంలోకి ప్రవేశిస్తాడు. జనవరి 16న కుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో సూర్యుడితో సంయోగం చెందుతాడు. జనవరి 18న చంద్రుడు కూడా ఇదే రాశిలో ఉండడంతో మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది. మహాలక్ష్మీ రాజయోగం కొన్ని రాశుల వారి ఆదాయాన్ని రెండింతలు పెంచే అవకాశం ఉంది.

Published on: Dec 11, 2025, 16:30:19 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకు వస్తుంది. కుజుడును గ్రహాల అధిపతి అని అంటారు. కుజుడు ధైర్యం, బలం వంటి వాటికి కారకుడు. కుజుడు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. సుమారు 45 రోజులు పాటు ఒకే రాశిలో సంచారం చేస్తాడు. ఆ తర్వాత మరో రాశిలోకి ప్రవేశిస్తాడు.

ఈ 4 రాశులకు 2026 సంక్రాంతి బాగా కలిసి వస్తుంది
ఈ 4 రాశులకు 2026 సంక్రాంతి బాగా కలిసి వస్తుంది

కొత్త సంవత్సరం, అంటే 2026లో కుజుడు ధనుస్సు నుంచి మకరంలోకి ప్రవేశిస్తాడు. జనవరి 16న కుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో సూర్యుడితో సంయోగం చెందుతాడు. జనవరి 18న చంద్రుడు కూడా ఇదే రాశిలో ఉండడంతో మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది.

మహాలక్ష్మీ రాజయోగం

మహాలక్ష్మీ రాజయోగం కొన్ని రాశుల వారి ఆదాయాన్ని రెండింతలు పెంచే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు. మరి ఈ మహాలక్ష్మీ రాజయోగం ఏ రాశుల వారికి అదృష్టం తీసుకురాబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.

జనవరి 18న మకర రాశిలో మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం

1.తులా రాశి

తులా రాశి వారికి ఈ రాజయోగం బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఆకస్మిక ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంది. కొత్త వాహనాలు, ఆస్తులను కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితంలో ఆనందం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

2.మేష రాశి

ఈ రాశి వారికి కుజ, చంద్రుల సంచారం బాగా కలిసి రాబోతోంది. ఈ రాశివారు మహాలక్ష్మీ రాజయోగంతో ఆనందంగా ఉంటారు. ఆర్థికంగా అనేక లాభాలు కలుగుతాయి. పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుంది. అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.

4.మకర రాశి

మకర రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. ఈ సమయంలో రాశివారికి శుభఫలితాలు ఎదురవుతాయి. ఉద్యోగులకు ఇది మంచి సమయం. వ్యాపారస్తులు కూడా మంచి లాభాలను పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks