ఈ రాశుల అమ్మాయిలు అంత ఈజీగా ప్రేమలో పడరు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు!

జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఈ రాశుల అమ్మాయిలు దృఢమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందుకే ఎవరికి అంత ఈజీగా పడరు. మనసుతో కాదు, ఎక్కువగా బుద్ధితో ముందడుగు వేస్తారు. దీంతో ఈ రాశుల అమ్మాయిలు అబ్బాయిల మాటలు విని ప్రేమలో పడరు.

Published on: Oct 16, 2025, 13:30:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయన్నది చెప్పడంతో పాటు, భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది కూడా చెప్పడానికి వీలవుతుంది. కొన్ని రాశుల వారిలో కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి. ఈ రాశుల అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు, అందరినీ ఈజీగా ఆకట్టుకుంటారు. వీరికి వీరిపై విశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరి వ్యక్తిత్వం అందరికీ నచ్చుతుంది. అయితే ఈ అమ్మాయిలు అంత ఈజీగా ఎవరి మాటలకు పడిపోరు.

ఈ రాశుల అమ్మాయిలను ప్రేమలో పడేయడం అంత ఈజీ కాదు (pinterest)
ఈ రాశుల అమ్మాయిలను ప్రేమలో పడేయడం అంత ఈజీ కాదు (pinterest)

వీళ్ళు ఇష్టపడే అమ్మాయిలు తిరిగి ప్రేమించాలంటే ఆ అబ్బాయిలకి చాలా కష్టమని చెప్పొచ్చు. జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఈ రాశుల అమ్మాయిలు దృఢమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందుకే ఎవరికి అంత ఈజీగా పడరు. మనసుతో కాదు, ఎక్కువగా బుద్ధితో ముందడుగు వేస్తారు. దీంతో ఈ రాశుల అమ్మాయిలు అబ్బాయిల మాటలు విని ప్రేమలో పడరు.

ఈ రాశుల అమ్మాయిలను ప్రేమలో పడేయడం అంత ఈజీ కాదు:

1.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి అమ్మాయిలు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి అమ్మాయిలు అంత ఈజీగా ఎవరినీ ప్రేమించరు. కేవలం మాటలు విని నమ్మరు. వీరిని ఇష్టపడే అబ్బాయిల పని అయిపోయినట్లే. అంతర్దృష్టిని అనుసరిస్తారు. ఇతరుల అసలైన ఉద్దేశం ఏంటనేది గమనించగలరు. వీరి మనసును గెలుచుకోవాలంటే కేవలం వట్టి మాటలు సరిపోవు. మాటలతో ఆకట్టుకోవాలనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. స్వచ్ఛమైన మనసు, నిజమైన ప్రేమ ఉంటేనే ఈ రాశి వారు తిరిగి ప్రేమిస్తారు.

2.మేష రాశి:

మేష రాశి అమ్మాయిలకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. లక్ష్యాలను సాధించాలని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే తమ మాటకు కట్టుబడి ఉంటారు. ఎవరైనా అబ్బాయిలు తియ్యటి మాటలు చెప్తే ఈ రాశి వారు అందుకు ఒప్పుకోరు. వీరు ఎక్కువ ఆలోచించి, మనసుతో కాక బుద్ధితోనే నిర్ణయాలు తీసుకుంటారు.

3.మకర రాశి:

మకర రాశి అమ్మాయిలు బాధ్యత, క్రమశిక్షణతో ఉంటారు. స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతారు. సులభంగా ఇతరులను ఇష్టపడరు. ఎవరైనా అబ్బాయిలు తియ్యగా మాట్లాడితే ఈ రాశి వారు ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. ఇతరుల ప్రవర్తనను చూసి అంచనా వేస్తారు. ఎప్పుడూ గంభీరంగా, స్టైలిష్‌గా కనబడతారు. అంత ఈజీగా తప్పు నిర్ణయాలు తీసుకోరు, ఆకర్షణకు గురవ్వరు.

4.కుంభ రాశి:

కుంభ రాశి అమ్మాయిలు కూడా అంత ఈజీగా ఇతరుల మాటలు విని ప్రేమించరు, ఇతరులను ఇష్టపడరు. స్వయంగా ఆలోచించి వారి నిర్ణయాలను వారే తీసుకుంటారు. ఎవరైనా ఫ్రీగా మాట్లాడితే వీరు అంత ఈజీగా ఆకర్షితులవ్వరు. నిజాయితీతో ఉంటారు, అదేవిధంగా తెలివైన సంభాషణను ఇష్టపడతారు. ఫ్లర్ట్ చేయడానికి మాత్రం వీరు అవకాశాన్ని ఇవ్వరు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More