కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన శక్తివంతమైన దీపాలు ఇవిగో.. ఇలా చేస్తే ఎంతో పుణ్యం, ఐశ్వర్యం!

కార్తీక మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్యఫలితం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు, సిరి సంపదలని పొందవచ్చు. జన్మజన్మల పాపాలన్నీ కూడా పోతాయి. అయితే దీపారాధన అంటే కార్తీక మాసంలో మనకి గుర్తొచ్చేది ఉసిరి దీపం. ఇక కార్తీక మాసంలో ఏ దీపం వెలిగిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం.

Published on: Oct 24, 2025, 08:00:05 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక మాసం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కార్తీకమాసం చాలా పవిత్రమైన మాసం. ఈ నెలలో కొన్ని పరిహారాలను పాటించడం, దీపారాధన చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది. కార్తీక మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్యఫలితం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు, సిరి సంపదలని పొందవచ్చు. జన్మజన్మల పాపాలన్నీ కూడా పోతాయి.

కార్తీక మాసంలో దీపారాధన (pinterest)
కార్తీక మాసంలో దీపారాధన (pinterest)

అయితే దీపారాధన అంటే కార్తీక మాసంలో మనకి గుర్తొచ్చేది ఉసిరి దీపం. ఉసిరికాయలో వత్తులు వేసి, నెయ్యి పోసి దీపారాధన చేస్తారు. అలాగే పిండి దీపాన్ని కూడా చాలామంది వెలిగిస్తూ ఉంటారు. కార్తీకమాసంలో వెలిగించాల్సిన దీపాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఐశ్వర్యం కలుగుతుంది

కార్తీకమాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం కలుగుతుంది. శక్తివంతమైన దీపాలు వెలిగించి శివుని ఆరాధిస్తే ఎక్కువ రేట్లు ఫలితం పొందవచ్చు. ఈ నెల రోజులు కూడా ఆడవాళ్లు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేయాలి. తులసి కోటను పూజించాలి. తులసి పూజకు ఎంతో విశిష్టత ఉంది. విపరీతమైన ఐశ్వర్యాన్ని పొందవచ్చు. తులసి కోట ముందు దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, ఆర్థికపరంగా కలిసి వస్తుంది.

కోటి సోమవారాలు ఉపవాసం చేసినంత ఫలితం

కార్తీక మాసంలో నది స్నానం చేస్తే కూడా ఎంతో పుణ్యం వస్తుంది. రోజూ కుదరకపోతే సోమవారం అయినా కచ్చితంగా చేయండి. కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది. అక్టోబర్ 30న వచ్చే సోమవారం నాడు ఉపవాసం ఉంటే, కోటి సోమవారాలు ఉపవాసం చేసినంత ఫలితం కలుగుతుంది.

బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన:

కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేస్తే చాలా మంచిది. అంటే ఉదయం 4:30 నుంచి 5:30 మధ్యలో దీపారాధన చేయాలి. సూర్యుడు ఉదయించక ముందు, సూర్యాస్తమయం అయిన తర్వాత దీపారాధన చేస్తే చక్కటి ఫలితం కలుగుతుంది.

నారికేళ దీపం

ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకుని సమానంగా పగిలేలా చూసుకోవాలి. ఒక కొబ్బరి చిప్పను నైవేద్యంగా పెట్టి, మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేయాలి. ఆ తర్వాత ఐదు ఒత్తులను ఒకటిగా చేసి వెలిగించాలి. కింద పెట్టకండి. ఒక పెళ్లాం లో బియ్యం పోసి, దానిపై కొబ్బరి చిప్పను పెట్టి దీపాన్ని వెలిగించండి.

పూజా గదిలో ఉన్న శివుని ఫోటోకి ఎదురుగా ఈ దీపాన్ని వెలిగిస్తే మంచిది. అలా కుదరకపోతే తులసి కోట ముందైనా వెలిగించొచ్చు. ఈ దీపం కొండెక్కిన తర్వాత, ఎవరు తిరగని చోట ఈ కొబ్బరి చిప్పను సోమవారం లేదా కార్తీక పౌర్ణమి నాడు వెలిగిస్తే మంచి జరుగుతుంది. అప్పుల బాధల నుంచి కూడా బయటపడవచ్చు. ధనప్రాప్తి కలుగుతుంది. సుఖసంతోషాలు ఉంటాయి.

పిండి దీపాలు:

కార్తీకమాసంలో పిండి దీపాలను కూడా వెలిగించవచ్చు. పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి, ఆవు పాలు వేసి పిండిని ముద్ద చేయాలి. ఆ తర్వాత ప్రమిద కింద చేసి, అందులో నెయ్యి, వత్తులు వేసి వెలిగించాలి. ఐదు వత్తులతో దీపారాధన చేస్తే మంచిది.

365 వత్తులతో దీపం:

కార్తీక మాసంలో 365 వత్తులతో దీపం వెలిగిస్తే కూడా మంచి జరుగుతుంది. ఏడాది అంతా దీపం పెట్టకుండా ఉన్న వారు కూడా కార్తీకమాసంలో 365 ఒత్తులు వెలిగిస్తే, 365 రోజులు దీపం పెట్టిన ఫలితం కలుగుతుంది. శివాలయంలో కూడా 365 వత్తులతో దీపం వెలిగించవచ్చు.

ఉసిరి దీపం:

తులసి కోట ముందు ఉసిరి దీపాన్ని పెడితే మంచి ఫలితం ఉంటుంది. శివాలయంలో నందీశ్వరుడు దగ్గర కూడా ఇదే దీపం పెట్టవచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More