...
...
Next Story

ఈ రాశుల వారిని అందరూ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, సులువుగా ఫిదా అవుతారు!

కొంత మంది ఎప్పుడూ అందరితో కలిసిపోయి సరదాగా ఉంటారు. కొంత మంది ఎప్పుడూ వారి లోకంలో వారే ఉంటారు. అయితే కొంత మందిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి, వాటిని చూసి చాలా మంది వారిని ఇష్టపడుతుంటారు. ఈ రాశుల వారిని అందరినీ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

Published on: Nov 6, 2025, 13:30:16 IST
Advertisement

రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఏ విధంగా ఉంటుందో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా చెప్పవచ్చు. కొంత మంది ఎప్పుడూ అందరితో కలిసిపోయి సరదాగా ఉంటారు. కొంత మంది ఎప్పుడూ వారి లోకంలో వారే ఉంటారు. అయితే కొంత మందిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి, వాటిని చూసి చాలా మంది వారిని ఇష్టపడుతుంటారు. ఈ రాశి వారు అందరూ ఇష్టపడే వ్యక్తులు. ఎప్పుడూ అందరూ మెచ్చుకుంటారు. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

ఈ రాశుల వారిని అందరూ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు

ఈ రాశుల వారిని అందరినీ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు (pinterest)
ఈ రాశుల వారిని అందరినీ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు (pinterest)

ఒక్కో రాశి వారిలో ఒక్కో ప్రత్యేకమైన గుణం ఉంటుంది. వాటిని బట్టి ఇతరులు మెచ్చుకుంటూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. చాలా మందికి ఈ రాశుల వారు అంటే ఎంత ఇష్టం. ఎల్లప్పుడూ వీరిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. మరి ఈ రాశుల్లో మీరు ఒకరా? చెక్ చేసుకోండి.

1.మిధున రాశి:

మిధున రాశి వారిలో కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి. ఇతరులతో ఇట్టే కలిసిపోతారు. స్నేహితులకు ఎప్పుడూ వినోదం పంచుతూ ఉంటారు. అందరితో కలిసి పోవడానికి ఇష్టపడతారు. దీంతో అందరూ వీళ్లకు చేరువవుతారు. వీళ్లలో ఉండే స్నేహపూర్వక స్వభావం కూడా అందరూ మెచ్చేలా చేస్తుంది. వీరితో కలిసి ఉంటే బాధ ఉన్నా కూడా సంతోషంగా ఉండొచ్చు. అలాగే ఈ రాశి వారు పార్టీలకు వెళ్లడానికీ ఇష్టపడుతుంటారు. ఇతరులతో కూడా ఇట్టే కలిసిపోతారు, సంతోషంగా ఉంటారు.

2.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారు ఎంతో నిజాయితీగా ఉంటారు. ఎప్పుడూ కర్కాటక రాశి వారు స్నేహితులుగా, కుటుంబ సభ్యులుగా అన్నిట్లో ముందుంటారు. ఎవరికి చిన్న అపాయం వచ్చినా తట్టుకోలేరు, సహాయం చేస్తారు. చిన్నప్పుడు అందరితో పెద్దగా కలిసి పోలేకపోయినా, పెద్దయ్యాక మాత్రం అందరితో సంతోషంగా, ఆప్యాయంగా సమయాన్ని గడుపుతారు. అందరూ వీరిని ఇష్టపడతారు.

3.ధనుస్సు రాశి:

సింహ రాశి వారు ఎల్లప్పుడూ ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. విజయాన్ని సాధించడానికి కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. సింహ రాశి వారి శక్తికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతూ ఉంటారు. ఏదైనా ఖర్చు పెట్టడానికి, సందడి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి కూడా ముందుంటారు. దీంతో అందరూ వీరికి ఆకర్షితులు అవుతారు, స్నేహపూర్వకంగా ఉంటారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe