...
...
Next Story

వీళ్ళకు ఈ ఏడాది రెండు సార్లు దీపావళి.. కుజ సంచారంతో అదృష్టం ప్రకాశిస్తుంది.. ఉద్యోగ ఆఫర్లు, పురోగతి, డబ్బు ఇలా ఎన్నో

ప్రస్తుతం, కుజుడు విశాఖ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. దీపావళి తరువాత శని అనురాధ నక్షత్రంలో సంచరిస్తాడు. కుజుడు అనురాధ నక్షత్ర సంచారం నవంబర్ 1న జరుగుతుంది. కుజ గ్రహం శని నక్షత్రంలో సుమారు 18 రోజులు ఉంటాడు, ఆపై నవంబర్ 18న నక్షత్రాన్ని మారుస్తాడు. మరి ఏ రాశులకు ఈ సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది?

Published on: Oct 15, 2025, 10:30:16 IST
Advertisement

కుజ నక్షత్ర సంచారం: గ్రహాల అధిపతి అయిన కుజుడు ఒక నిర్దిష్ట సమయంలో రాశులను, నక్షత్రాలను మారుస్తాడు. ప్రస్తుతం, కుజుడు విశాఖ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. దీపావళి తరువాత శని అనురాధ నక్షత్రంలో సంచరిస్తాడు. కుజుడు అనురాధ నక్షత్ర సంచారం నవంబర్ 1న జరుగుతుంది. కుజ గ్రహం శని నక్షత్రంలో సుమారు 18 రోజులు ఉంటాడు, ఆపై నవంబర్ 18న నక్షత్రాన్ని మారుస్తాడు.

వీళ్ళకు ఈ ఏడాది రెండు సార్లు దీపావళి (pinterest)
వీళ్ళకు ఈ ఏడాది రెండు సార్లు దీపావళి (pinterest)

శని నక్షత్రంలో కుజుడు ప్రవేశించడంతో కుంభరాశితో సహా ఆరు రాసులు మంచి ఫలితాలను పొందుతారు. జ్యోతిష్కుడు నరేంద్ర ఉపాధ్యాయ్ ప్రకారం, దీపావళి తర్వాత కుజ గ్రహం నక్షత్ర మార్పు చేయడంతో జీవితంలో సానుకూల మార్పులను ఎదుర్కొంటారు. మరి ఏ రాశులకు ఈ సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది? వీరిలో మీరూ ఒకరేమో చూసుకోండి.

కుజ నక్షత్ర సంచారం మార్పు.. ఈ రాశులకు అనేక లాభాలు

1. వృషభ రాశి:

కుజ నక్షత్ర మార్పు వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు అదృష్టం లభిస్తుంది. జీవితంలో సంతోషం, సంవృద్ధి ఉంటాయి. మంచి ఫలితాలను పొందుతారు. సంతోషంగా వుంటారు. వ్యాపారంలో కూడా ఎక్కువ లాభాలు ఉంటాయి.

2. మిథున రాశి

కుజ నక్షత్ర మార్పు మిథున రాశి వారికి మంచిది. ఈ సమయంలో, మీరు పనిలో పురోగతిని పొందవచ్చు. ఉద్యోగాలు చేసే వారికి కొత్త ఉద్యోగ ఆఫర్లు లభించే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది, ఇది ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. మీరు మీ ప్రియమైనవారి మద్దతును పొందుతారు. వృత్తిపరంగా కూడా బాగుంటుంది.

3. కన్య రాశి

తులా రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మాటల్లో మాధుర్యం ఉంటుంది. మీరు ఉద్యోగంలో పురోభివృద్ధి సాధిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు అందుతుంది. ఆర్థికంగా మీ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కోర్టులో తీర్పు మీకు అనుకూలంగా రావచ్చు.

5. మకర రాశి

కుజ నక్షత్ర మార్పు మకర రాశి వారికి శుభప్రదం కానుంది. ఈ సమయంలో మీకు అదృష్టం లభిస్తుంది. సంపద పెరుగుతుంది. చిక్కుకుపోయిన డబ్బు తిరిగి వస్తుంది, మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. కార్యాలయంలో మీ కృషి ఫలిస్తుంది.

6. కుంభ రాశి

కుంభ రాశి వారు ఈ సమయంలో శుభవార్త వింటారు. మీరు కొన్ని ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ప్రియమైన వారి మద్దతును పొందుతారు. డబ్బుకు సంబంధించిన విషయాలను పరిష్కరించుకోవచ్చు. వ్యాపారం చేసేవారు శుభ ఫలితాలను పొందుతారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe