మనం ఇంట్లో చాలా మొక్కలను పెంచుతూ ఉంటాము. వాస్తు ప్రకారం ఇంట్లో మొక్కలు ఉంటే మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఉండే మొక్కలు కూడా సానుకూల, ప్రతికూల శక్తులకు కారణం అవుతాయి.

శాస్త్రం ప్రకారం ఇంట్లో మందారం మొక్క ఉంటే మంచిదట. మందారం మొక్కకు సూర్య భగవానుడితో, కుజ గ్రహంతో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఇంట్లో మందారం మొక్క ఉండడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు కూడా తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. ఈ మొక్కను ఇంట్లో పెంచడం మంచిది.
మందారం మొక్కతో కుజ దోషాన్ని తొలగించుకోవచ్చు
కుజ దోషం కారణంగా చాలా మందికి పెళ్లి అవ్వదు. కొంత మంది వైవాహిక జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరి కొంత మంది కుజదోషం కారణంగా కెరీర్‌లో సమస్యలను ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు కూడా చాలా మందిని కుజదోషం వలన వెంటాడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మందార పూలతో హనుమంతుని ఆరాధించడం మంచిది. ఎర్ర మందారాలను హనుమంతుడికి సమర్పిస్తే ఆంజనేయస్వామి అనుగ్రహం కలుగుతుంది. కుజ దోష ప్రభావం నుంచి కూడా బయట పడవచ్చు. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
నిత్యా పూజలో మందారాలు
నిత్య పూజలో మందారాలను ఉపయోగిస్తే ఇంట్లో సుఖ శాంతులు కలుగుతాయి. కుటుంబ సభ్యులకు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఈ మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తులు రావు. సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రగతిని ప్రోత్సహిస్తుంది. మందారం మొక్క ఆధ్యాత్మిక ప్రగతిని ప్రోత్సహిస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏదైనా పనిని పూర్తి చేయలేక ఇబ్బంది పడుతున్నట్లయితే మందార పూలతో పూజ చేయండి. పనులు వేగంగా పూర్తవుతాయి.
మందారం మొక్కను పెంచేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఎండ బాగా తగిలే ప్రదేశంలో మందారం మొక్కను నాటండి. అలాగే పరిశుభ్రమైన ప్రదేశంలో ఈ మొక్కను ఉంచండి. వాడిపోకుండా చూసుకోండి. క్రమం తప్పకుండా నీళ్లు పోయండి.
పూజ కోసం తాజా, స్వచ్ఛమైన పూలను మాత్రమే ఉపయోగించండి. వాడిపోయిన పూలను దేవుడికి సమర్పించవద్దు.
{{/usCountry}}పూజ కోసం తాజా, స్వచ్ఛమైన పూలను మాత్రమే ఉపయోగించండి. వాడిపోయిన పూలను దేవుడికి సమర్పించవద్దు.
{{/usCountry}}సానుకూల దృక్పథంతో ఏ పరిహారాన్ని అయినా పాటించినట్లయితే తప్పక మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆరాధన చేసేటప్పుడు మనస్ఫూర్తిగా ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.
జాతకంలో కుజ దోషం ఉన్నవారు ఏమి చేయాలి?
కుజ దోషం ఉన్నవారు ప్రతి రోజూ హనుమంతుడికి ఎర్రటి మందార పూలను సమర్పించాలి. దీని వల్ల కుజుడి ప్రతికూల ప్రభావం తగ్గి, మనశ్శాంతి లభిస్తుంది.