ఇంటి ఆవరణలో ఈ మొక్క ఒక్క ఉంటే చాలు.. అదృష్టం మీ వెంటే! వాస్తు, జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారు?

ఇంట్లో మొక్కలను పెంచుకోవడం అందరికీ ఇష్టమే, కానీ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు మన జీవితాన్ని మలుపు తిప్పే శక్తిని కలిగి ఉంటాయి. ముఖ్యంగా మందార మొక్కకు ఉన్న ప్రాధాన్యత గురించి తెలుసుకుంటే మీరు వెంటనే దాన్ని మీ పెరట్లో నాటుకుంటారు. 

Published on: Jun 17, 2026, 12:31:03 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మనం ఇంట్లో చాలా మొక్కలను పెంచుతూ ఉంటాము. వాస్తు ప్రకారం ఇంట్లో మొక్కలు ఉంటే మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఉండే మొక్కలు కూడా సానుకూల, ప్రతికూల శక్తులకు కారణం అవుతాయి.

ఇంటి ఆవరణలో ఈ మొక్క ఒక్క ఉంటే చాలు.. అదృష్టం మీ వెంటే! వాస్తు, జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారు? (pinterest)
ఇంటి ఆవరణలో ఈ మొక్క ఒక్క ఉంటే చాలు.. అదృష్టం మీ వెంటే! వాస్తు, జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారు? (pinterest)

శాస్త్రం ప్రకారం ఇంట్లో మందారం మొక్క ఉంటే మంచిదట. మందారం మొక్కకు సూర్య భగవానుడితో, కుజ గ్రహంతో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఇంట్లో మందారం మొక్క ఉండడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు కూడా తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. ఈ మొక్కను ఇంట్లో పెంచడం మంచిది.

మందారం మొక్కతో కుజ దోషాన్ని తొలగించుకోవచ్చు

కుజ దోషం కారణంగా చాలా మందికి పెళ్లి అవ్వదు. కొంత మంది వైవాహిక జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరి కొంత మంది కుజదోషం కారణంగా కెరీర్‌లో సమస్యలను ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు కూడా చాలా మందిని కుజదోషం వలన వెంటాడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మందార పూలతో హనుమంతుని ఆరాధించడం మంచిది. ఎర్ర మందారాలను హనుమంతుడికి సమర్పిస్తే ఆంజనేయస్వామి అనుగ్రహం కలుగుతుంది. కుజ దోష ప్రభావం నుంచి కూడా బయట పడవచ్చు. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.

నిత్యా పూజలో మందారాలు

నిత్య పూజలో మందారాలను ఉపయోగిస్తే ఇంట్లో సుఖ శాంతులు కలుగుతాయి. కుటుంబ సభ్యులకు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఈ మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తులు రావు. సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రగతిని ప్రోత్సహిస్తుంది. మందారం మొక్క ఆధ్యాత్మిక ప్రగతిని ప్రోత్సహిస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏదైనా పనిని పూర్తి చేయలేక ఇబ్బంది పడుతున్నట్లయితే మందార పూలతో పూజ చేయండి. పనులు వేగంగా పూర్తవుతాయి.

మందారం మొక్కను పెంచేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఎండ బాగా తగిలే ప్రదేశంలో మందారం మొక్కను నాటండి. అలాగే పరిశుభ్రమైన ప్రదేశంలో ఈ మొక్కను ఉంచండి. వాడిపోకుండా చూసుకోండి. క్రమం తప్పకుండా నీళ్లు పోయండి.

పూజ కోసం తాజా, స్వచ్ఛమైన పూలను మాత్రమే ఉపయోగించండి. వాడిపోయిన పూలను దేవుడికి సమర్పించవద్దు.

సానుకూల దృక్పథంతో ఏ పరిహారాన్ని అయినా పాటించినట్లయితే తప్పక మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆరాధన చేసేటప్పుడు మనస్ఫూర్తిగా ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.

జాతకంలో కుజ దోషం ఉన్నవారు ఏమి చేయాలి?

కుజ దోషం ఉన్నవారు ప్రతి రోజూ హనుమంతుడికి ఎర్రటి మందార పూలను సమర్పించాలి. దీని వల్ల కుజుడి ప్రతికూల ప్రభావం తగ్గి, మనశ్శాంతి లభిస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More