...
...
Next Story

Jaya Ekadashi: ఈరోజే జయ ఏకాదశి.. విష్ణువు అనుగ్రహం కోసం ఏ రాశి వారు ఏం చేస్తే మంచిదో తెలుసుకోండి!

జయ ఏకాదశి జనవరి 29, అనగా ఈరోజు వచ్చింది. దీనిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. భూమి ఏకాదశి అని కూడా పేరు ఉంది. పైగా ఈ విశేషమైన రోజున రవి యోగం కూడా ఏర్పడబోతోంది. ఇది మరింత శుభప్రదమైనది. జయ ఏకాదశి నాడు విష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఏ రాశి వారు ఏం చేస్తే మంచిదో తెలుసుకోండి.

Published on: Jan 29, 2026, 07:00:44 IST
Advertisement

ప్రతి ఏటా మాఘ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని జయ ఏకాదశి అని అంటారు. ఈ సంవత్సరము జయ ఏకాదశి జనవరి 29, అనగా ఈరోజు వచ్చింది. దీనిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. భూమి ఏకాదశి అని కూడా పేరు ఉంది. పైగా ఈ విశేషమైన రోజున రవి యోగం కూడా ఏర్పడబోతోంది. ఇది మరింత శుభప్రదమైనది.

ఏకాదశి

Jaya Ekadashi: ఈరోజే జయ ఏకాదశి.. విష్ణువు అనుగ్రహం కోసం ఏ రాశి వారు ఏం చేస్తే మంచిదో తెలుసుకోండి (pinterest)
Jaya Ekadashi: ఈరోజే జయ ఏకాదశి.. విష్ణువు అనుగ్రహం కోసం ఏ రాశి వారు ఏం చేస్తే మంచిదో తెలుసుకోండి (pinterest)

ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది. ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు వస్తాయి. ఇక ఈ విశేషమైన జయ ఏకాదశి నాడు విష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే చాలా మంది వారి రాశి ప్రకారం పరిహారాలను పాటిస్తూ ఉంటారు. మరి ఈ జయ ఏకాదశి లేదా భీష్మ ఏకాదశి వేళ ఏ రాశి వారు వేటిని పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

జయ ఏకాదశి 2026.. 12 రాశుల వారు ఏం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోండి

మేష రాశి:

మేష రాశి వారు ఈ విశేషమైన జయ ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించండి. పసుపు, చందనం, బెల్లాన్ని సమర్పిస్తే మంచిది.

వృషభ రాశి:

వృషభ రాశి వారు అన్నింటా జయలే కలగాలంటే ఈ విశేషమైన జయ ఏకాదశి నాడు లక్ష్మీనారాయణకు పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. ఇది శుభ ఫలితాలను తీసుకువస్తుంది.

మిథున రాశి:

మిథున రాశి వారు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచిది. అలాగే పశువులకు పచ్చగడ్డిని ఆహారంగా ఇవ్వండి.

కర్కాటక రాశి:

సింహ రాశి వారు మహావిష్ణువుకు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి, ఎర్రటి పూలతో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఆనందంగా ఉండవచ్చు.

కన్య రాశి:

కన్య రాశి వారు జయ ఏకాదశి నాడు విష్ణువుకు తులసిదళాలను సమర్పించాలి. పసుపు రంగు పండ్లను నైవేద్యంగా పెడితే మంచిది.

తులా రాశి:

తులా రాశి వారు లక్ష్మీదేవికి పసుపు వస్త్రాలు, గాజులను సమర్పించాలి. అలాగే లక్ష్మీదేవిని, విష్ణువును మనస్ఫూర్తిగా ఆరాధించాలి.

వృశ్చిక రాశి:

ఈ రాశి వారు ఈ జయ ఏకాదశి నాడు విష్ణువును పూజిస్తూ సుందరకాండ పారాయణం చేయడం మంచిది.

ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారు జయ ఏకాదశి నాడు విష్ణువుకు స్వీట్లు నైవేద్యంగా పెట్టి, సత్యనారాయణ వ్రత కథను చదువుకోవడం మంచిది.

మకర రాశి:

మకర రాశి వారు జయ ఏకాదశి నాడు మహావిష్ణువును పూజించాలి. దుప్పట్లు, ఆహారాన్ని దానం చేయడం మంచిది.

కుంభ రాశి:

కుంభ రాశి వారు విష్ణువుకు పసుపు పాలు సమర్పించాలి. “ఓం నమో నారాయణాయ” అనే మంత్రాన్ని పఠిస్తే చాలా మంచి జరుగుతుంది.

మీన రాశి:

మీన రాశి వారు విష్ణువుకు పసుపు వస్త్రాలను సమర్పించి, పసుపు రంగులో ఉండే పుష్పాలతో విష్ణువును భక్తితో ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe