Subrahmanya Swamy: ఈరోజే సుబ్రహ్మణ్య షష్ఠి.. శ్రీ షణ్ముఖ స్తోత్రం, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటే ఎంతో మంచిది!
మార్గశిర మాసం శుక్లపక్ష షష్టి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టిని జరుపుతారు. ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్టి నవంబర్ 26, అంటే ఈరోజు వచ్చింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం వలన సంతోషంగా ఉండొచ్చు. అలాగే సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా శ్రీ షణ్ముఖ స్తోత్రం, సుబ్రహ్మణ్య అష్టకం పఠిస్తే మంచిది.
ప్రతి ఏటా మార్గశిర మాసం శుక్లపక్ష షష్టి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టిని జరుపుతారు. ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్టి నవంబర్ 26, అంటే ఈరోజు వచ్చింది. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం వలన సకల పాపాలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. అలాగే సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా శ్రీ షణ్ముఖ స్తోత్రం, సుబ్రహ్మణ్య అష్టకం పఠిస్తే మంచిది.

ఒకవేళ ఈ రెండు చదవలేని వారు “ఓం శ్రీ శరవణ భవాయ నమః” అనే మంత్రాన్ని జపిస్తే మంచిది. ఈ మంత్రాన్ని జపిస్తే కూడా మంచి జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రత్యేక అనుగ్రహం కూడా ఉంటుంది.
శ్రీ షణ్ముఖ స్తోత్రం
నారదాది దేవయోగి బృందహృన్నికేతనం
బర్హివర్యవాహమిందు శేఖరేష్టనందనమ్
భక్తలోకరోగదుఃఖ పాపసంఘభంజనం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్..
తారకారి మింద్రముఖ్య దేవబృందవందితం
చంద్రచందనాది శీతలాంకమాత్మభావితమ్
యక్షసిద్ధకిన్నరాది ముఖ్యదివ్యపూజితం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్..
చంపకాబ్జమాలతీ సుమాదిమాల్యభూషితం
దివ్యషట్కిరీటహార కుండలాద్యలంకృతమ్
కుంకుమాదియుక్త దివ్యగంధపంకలేపితం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్..
ఆశ్రితాఖిలేష్ట లోకరక్షణామరాంఘ్రివం
శక్తిపాణిమచ్యుతేంద్ర పద్మసంభవాధిపమ్
శిష్టలోకచింతితార్థసిద్ధిదానలోలుపం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్..
వీరబాహు పూర్వ కోటివీర సంఘ సౌఖ్యదం
శూరపద్మముఖ్య లక్షకోటిశూరముక్తిదమ్
ఇంద్రపూర్వదేవసంఘ సిద్ధనిత్యసౌఖ్యదం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్..
జంబవైరికామినీ మనోరథాభిపూరకం
కుంభసంభవాయ సర్వధర్మసారదాయకమ్
తం భవాబ్ధిపోతమంబికేయమాశు సిద్ధిదం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్..
పూర్ణచంద్రబింబకోటి తుల్యవక్త్రపంకజం
వర్ణనీయ సచ్చరిత్రమిష్ట సిద్ధిదాయకమ్
స్వర్ణవర్ణగాత్ర ముగ్రసిద్ధలోకశిక్షకం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్..
పూర్వజన్మసంచితాఘ సంఘభంగతత్పరం
సర్వధర్మదానకర్మ పూర్వపుణ్య సిద్ధిదమ్
సర్వశత్రు సంఘభంగ దక్షమింద్రజాపతిం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్..
ఇతి శ్రీమచ్ఛంకరభగవత కృతౌ తిరుచెందూర్ శ్రీ షణ్ముఖ స్తోత్రమ్..
సుబ్రహ్మణ్య అష్టకం
హే స్వామినాథ కరుణాకర దీనబంధో
శ్రీపార్వతీశ ముఖ పంకజ పద్మబంధో
శ్రీశాది దేవగణపూజిత పాదపద్మ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్..
దేవాది దేవనుత దేవగణాధినాథ
దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద
దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్..
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్
తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ
శృత్యాగమప్రణవవాచ్య నిజస్వరూప
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్..
క్రౌంచా సురేంద్ర పరిఖండన శక్తిశూల
పాశాదిశస్త్ర పరిమండిత దివ్యపాణే
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్..
దేవాదిదేవ రథమండల మధ్య వేద్య
దేవేంద్ర పీఠనగరం దృఢ చాపహస్తమ్
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్..
హారాదిరత్న మణియుక్త కిరీటహార
కేయూర కుండలలసత్కవచాభి రామ
హే వీర తారక జయామరబృందవంద్య
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్..
పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః
పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రైః
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్..
శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్
భక్త్వా తు మామవకళాధర కాంతి కాంత్యా
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్..
సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటి జన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి..
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం సంపూర్ణం...
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


