హిందూ ధర్మంలో ఆవును గోమాతగా భావిస్తారు. సకల దేవతలు గోవులో కొలువై ఉన్నారని నమ్ముతారు. అందుకనే ఇలాంటి శుభకార్యాలు, వేడుకలు వంటివి జరిగినప్పుడు ఆవుకు కచ్చితంగా ప్రత్యేక స్థానాన్ని ఇస్తారు. ప్రతిఏటా కార్తీక మాసంలో శుక్లపక్ష అష్టమి నాడు గోపాష్టమి జరుపుతారు. ఆ రోజు గోవులకు స్నానం చేయించి, అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది.

ఈ ఏడాది గోపాష్టమి నవంబర్ 17, అంటే ఈరోజు వచ్చింది. గోపాష్టమి వేడుకలు అసలు ఎలా ప్రారంభమయ్యాయి? ఈ పండుగకు కృష్ణుడి బాల్యంతో ప్రత్యేక సంబంధం ఉందట. పురాణాల విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే, ఆసక్తికరమైన కథ దీని వెనుక ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
గోపాష్టమి పురాణ కథ
పురాణాల ప్రకారం చూస్తే, కృష్ణుడు సుమారు ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ రోజు తన తల్లి యశోదమ్మతో ఇలా అన్నాడట. "అమ్మా! నేను పెద్దవాడిని అయ్యాను. దూడలను మేపడానికి వెళ్లను. ఆవులను మేపడానికి వెళ్తాను" అని తన మనసులోని కోరికను చెప్పగా, కృష్ణుడి మాటలు విన్న యశోదమ్మ, "నాయనా! ఈ విషయం మీ నాన్న నందబాబాతో మాట్లాడుకో" అని చెప్పింది.
అప్పుడు బాలగోపాలుడు నందబాబా దగ్గరకు వెళ్లి తన కోరికను చెప్పగా, ఇకపై దూడలను కాకుండా ఆవులను మేపడానికి వెళ్తానని పట్టుపట్టాడు. పెద్ద ఆవులను మేపడం కష్టమవుతుందని భావించిన నందబాబా ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణుడు మాత్రం నిర్ణయాన్ని మార్చుకోలేదు. చివరకు నందబాబా అతను చెప్పిన దానికి ఒప్పుకున్నాడు.
ఆవులను మేపడానికి వెళ్లే ముందు పురోహితుడిని సంప్రదించి ముహూర్తం తెలుసుకోవాలని నందబాబా కృష్ణుడికి సూచించగా, సరేనని పురోహితుడి దగ్గరకు కృష్ణుడు వెళ్లాడు. నందబాబా ఆవులను మేపడం ప్రారంభించడానికి ముందు శుభముహూర్తం చూడమని పిలిచారని పురోహితుడితో చెప్పి, ఈరోజే ఆవులను మేపడానికి శుభముహూర్తం అని చెబితే పుష్కలంగా వెన్నను బహుమతిగా ఇస్తానని కృష్ణుడు చెప్తాడు.
కృష్ణుడి మాటలు విన్న పురోహితుడు నందబాబా దగ్గరకు వెళ్లి ఈరోజే శుభప్రదమైన రోజు అని చెప్తాడు. అంతేకాకుండా, ఆ తర్వాత ఏడాది వరకు ఆవులను మేపడం ప్రారంభించడానికి మరో శుభముహూర్తం లేదని చెప్తాడు.
{{/usCountry}}కృష్ణుడి మాటలు విన్న పురోహితుడు నందబాబా దగ్గరకు వెళ్లి ఈరోజే శుభప్రదమైన రోజు అని చెప్తాడు. అంతేకాకుండా, ఆ తర్వాత ఏడాది వరకు ఆవులను మేపడం ప్రారంభించడానికి మరో శుభముహూర్తం లేదని చెప్తాడు.
{{/usCountry}}కృష్ణుడు తొలిసారిగా ఆవులను మేపే బాధ్యత స్వీకరించిన రోజు కార్తీక అష్టమి. అందుకే ఈ పవిత్రమైన రోజును గోపాష్టమిగా చెప్తారు. అప్పటినుంచి గోపాష్టమి నాడు గోమాతను పూజించే సంప్రదాయం కూడా వచ్చింది. భక్తులందరూ ఆవులకు స్నానం చేయించి, పూలు, వస్త్రాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. పచ్చగడ్డి, బెల్లం, ఇతర ఆహార పదార్థాలను గోవులకు తినిపిస్తారు.
గోమాతకు సేవ చేయడం వలన ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయి. ఐశ్వర్యం కూడా లభిస్తుంది. శ్రీకృష్ణుని అనుగ్రహం కూడా ఉంటుంది.