ప్రతి ఏటా మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి నాడు వివాహ పంచమి జరుపుకుంటాము. సీతారాములకి ఈరోజే వివాహమైందని అంటారు. ఈరోజు శ్రీరాముడు, సీతాదేవి తండ్రి జనక మహారాజు ఏర్పరిచిన స్వయంవరానికి వెళ్లి శివధనస్సును విరిచి సీతను పెళ్లాడిన రోజు.

ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. వైవాహిక జీవితంలో ఆనందం ఉండాలన్నా, పెళ్లి కాని వారికి పెళ్లి కుదరాలన్నా, సీతా రాములను ఆరాధిస్తూ కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటిస్తే శుభఫలితాలను పొందవచ్చు. వివాహ జీవితంలో సంతోషం ఉంటుంది. పైగా ఈరోజు కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఉండడం మరింత విశేషం.
వివాహ పంచమి 2025 నాడు ప్రత్యేకమైన యోగాలు:
పంచాంగం ప్రకారం మార్గశిర శుక్లపక్ష పంచమి తిథి నవంబర్ 24 రాత్రి 9:22కు మొదలై నవంబర్ 25 రాత్రి 10:56 వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం వివాహ పంచమి జరుపుకోవాలి. కనుక నవంబర్ 25, అంటే ఈరోజు జరుపుకోవాలి. ఈరోజు కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఏర్పడడం విశేషం — ధ్రువయోగం, సర్వార్థ సిద్ధి యోగం, శివవాస యోగం ఏర్పడ్డాయి. ఈ శుభ యోగాలు ఏర్పడిన ఈ రోజు సీతారాముల్ని ఆరాధిస్తే ఎన్నో లాభాలను పొందవచ్చు.
వివాహ పంచమి నాడు చేయవలసిన పరిహారాలు:
వివాహ పంచమి నాడు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తే శుభఫలితాలు కలుగుతాయి. సీతారాముల ప్రత్యేక అనుగ్రహం లభించి సంతోషంగా ఉండొచ్చు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి.
వివాహ పంచమి వ్రతం:
వివాహ పంచమి నాడు ఉపవాసం ఉండి సీతారాముల్ని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి. ఇంట్లో ఆనందం, ప్రశాంతత కూడా ఉంటుంది.
ఈ మంత్రాలను జపిస్తే మంచిది:
- శ్రీ శ్రీ క్లీం శ్రీ రామాయ నమః
- ఓం సీతాయై నమః
- ఓం శ్రీ సీతారామయ్య నమః
- రామ గాయత్రి మంత్రం, సీతా గాయత్రి మంత్రాన్ని కూడా జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు రామచరితమానస్ చదివితే కూడా శుభాలు కలుగుతాయి.
సీతారాముల్ని పూజించండి:
వివాహ పంచమి వేళ సీతారాముల్ని ఆరాధించాలి. సీతాదేవికి అలంకరణ వస్తువులను సమర్పించండి. అలాగే పండ్లు, స్వీట్లు సమర్పించండి. ఇవాళ అవసరమైన వారికి దానం చేస్తే కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది.
{{/usCountry}}వివాహ పంచమి వేళ సీతారాముల్ని ఆరాధించాలి. సీతాదేవికి అలంకరణ వస్తువులను సమర్పించండి. అలాగే పండ్లు, స్వీట్లు సమర్పించండి. ఇవాళ అవసరమైన వారికి దానం చేస్తే కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది.
{{/usCountry}}గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.