...
...
Next Story

ఈరోజే కుజ, వరుణల శక్తివంతమైన నవపంచమ యోగం, ఈ రాశుల వారి జీవితంలో వెలుగులు.. కొత్త ప్రాజెక్టులు, డబ్బుతో పాటు ఎన్నో!

ఈరోజు కుజుడు–వరుణుడు నవపంచమ యోగం నవంబర్ 4న ఉదయం 9:27కి ఏర్పడింది. ఈ యోగం 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువచ్చింది. మరి ఏ రాశుల వారికి సానుకూల మార్పులు ఎదురవుతున్నాయి, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Nov 4, 2025, 12:00:03 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మారుస్తాయి. అలాంటప్పుడు అశుభ యోగాలు, శుభ యోగాలు ఏర్పడతాయి. ఈరోజు నవంబర్ 4న కుజుడు, వరుణుడు నవపంచమ యోగాన్ని ఏర్పరిస్తున్నారు. ఈ యోగం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు రానున్నాయి. ఈ యోగం అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేసినా, కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు.

కుజ, వరుణ నవపంచమ యోగం (pinterest)
కుజ, వరుణ నవపంచమ యోగం (pinterest)

పంచాంగం ప్రకారం, ఈరోజు కుజుడు–వరుణుడు నవపంచమ యోగం నవంబర్ 4న ఉదయం 9:27కి ఏర్పడింది. ఈ యోగం 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువచ్చింది. మరి ఏ రాశుల వారికి సానుకూల మార్పులు ఎదురవుతున్నాయి, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కుజ, వరుణ నవపంచమ యోగం.. ఈ రాశుల వారికి అనేక లాభాలు

కుజ, వరుణ సంయోగం

ఈ రెండింటి కలయిక వలన ఏర్పడిన నవపంచమ యోగం మూడు రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకు వచ్చింది. అదృష్టం కూడా ప్రకాశిస్తుంది, విజయాలను కూడా అందుకుంటారు. మరి ఏ రాశుల వారికి ఇది బాగా కలిసి వస్తుంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందారు లేదా పొందుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

1.మేష రాశి

మేష రాశి వారికి ఈ నవపంచమ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. ఈ సమయంలో ఈ రాశి వారి ధైర్యం పెరుగుతుంది.

వృశ్చిక రాశి వారికి ఈ యోగం అనేక విధాలుగా కలిసి వస్తుంది. సంతోషంగా ఉంటారు. అదృష్టం కూడా ఎక్కువ అవుతుంది. కెరీర్‌లో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం. రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. భూములు, ఇళ్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఎనర్జిటిక్‌గా ఉంటారు.

3.మీన రాశి

మీన రాశి వారికి ఈ నవపంచమ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పని ప్రదేశంలో ఎనర్జిటిక్‌గా ఉంటారు.

ఆర్థికపరంగా ఎక్కువ లాభాలు పొందుతారు. పాత అప్పులు తొలగిపోతాయి. విజయవంతులవుతారు. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe