ఈరోజే శుక్ర, శనిల షడాష్టక దృష్టి యోగం.. ఈ ఐదు రాశులకు విపరీతమైన డబ్బు, సంతోషం, ప్రొమోషన్లతో పాటు ఎన్నో!

డబ్బు, సంపద, విలాసాలకు కారకుడు అయినటువంటి శుక్రుడు మరియు న్యాయదేవుడు శని యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ అరుదైన కలయిక కొన్ని రాశుల వారికి మంచి చేయబోతోంది. ఈరోజు శుక్రుడు, శని 150 డిగ్రీల దూరంలో ఉంటారు. దీంతో ఐదు రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి.

Published on: Nov 03, 2025 12:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు సహజంగా ఏర్పడతాయి. జ్యోతిష లెక్కల ప్రకారం కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక గ్రహాల కలయిక శుభ ఫలితాలను తీసుకొస్తుంది. నవంబర్ 3 అంటే ఈరోజు షడాష్టక దృష్టి యోగం ఏర్పడుతోంది.

షడాష్టక దృష్టి యోగంతో ఈ రాశుల వారికి అనేక లాభాలు (pinterest)
షడాష్టక దృష్టి యోగంతో ఈ రాశుల వారికి అనేక లాభాలు (pinterest)

శుక్ర, శనిల షడాష్టక దృష్టి యోగం

డబ్బు, సంపద, విలాసాలకు కారకుడు అయినటువంటి శుక్రుడు మరియు న్యాయదేవుడు శని యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ అరుదైన కలయిక కొన్ని రాశుల వారికి మంచి చేయబోతోంది. ఈరోజు శుక్రుడు, శని 150 డిగ్రీల దూరంలో ఉంటారు. దీంతో ఐదు రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి.

కుటుంబంలో సంతోషం ఉంటుంది. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. మరి ఈ షడాష్టక దృష్టి యోగం ఏ రాశుల వారికి శుభఫలితాలను తీసుకురాబోతోంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం.

షడాష్టక దృష్టి యోగంతో ఈ రాశుల వారికి అనేక లాభాలు

1.కన్యా రాశి:

కన్యా రాశి వారికి ఈ యోగం విపరీతమైన లాభాలను తీసుకురాబోతోంది. ఈ సమయంలో శని, శుక్రుల అనుగ్రహంతో ఈ రాశి వారు ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. అనేక విధాలుగా కలిసి వస్తుంది.

2.వృషభ రాశి:

వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ సమయంలో ఈ రాశి వారికి శుభఫలితాలు ఎదురవుతాయి. పని ప్రదేశంలో సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి.

3.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి ఇది శుభ సమయం. ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికపరంగా లాభాలను పొందుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పాత సమస్యలు తొలగిపోతాయి. ఆస్తికి సంబంధించిన సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.

4.మకర రాశి:

మకర రాశికి అధిపతి శని. ఈ సమయంలో దృష్టి యోగం కారణంగా ఈ రాశి వారు శుభఫలితాలను పొందుతారు. విజయాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఇది శుభసమయం. పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

5.మీన రాశి:

మీన రాశి వారికి ఇది శుభసమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. విజయాలను అందుకుంటారు. పాత సమస్యలు తొలగిపోతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. సక్సెస్‌ను అందుకుంటారు. ప్రేమ జీవితం కూడా సంతోషంగా మారుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More