గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు సహజంగా ఏర్పడతాయి. జ్యోతిష లెక్కల ప్రకారం కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక గ్రహాల కలయిక శుభ ఫలితాలను తీసుకొస్తుంది. నవంబర్ 3 అంటే ఈరోజు షడాష్టక దృష్టి యోగం ఏర్పడుతోంది.
శుక్ర, శనిల షడాష్టక దృష్టి యోగం

డబ్బు, సంపద, విలాసాలకు కారకుడు అయినటువంటి శుక్రుడు మరియు న్యాయదేవుడు శని యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ అరుదైన కలయిక కొన్ని రాశుల వారికి మంచి చేయబోతోంది. ఈరోజు శుక్రుడు, శని 150 డిగ్రీల దూరంలో ఉంటారు. దీంతో ఐదు రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి.
కుటుంబంలో సంతోషం ఉంటుంది. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. మరి ఈ షడాష్టక దృష్టి యోగం ఏ రాశుల వారికి శుభఫలితాలను తీసుకురాబోతోంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం.
షడాష్టక దృష్టి యోగంతో ఈ రాశుల వారికి అనేక లాభాలు
1.కన్యా రాశి:
కన్యా రాశి వారికి ఈ యోగం విపరీతమైన లాభాలను తీసుకురాబోతోంది. ఈ సమయంలో శని, శుక్రుల అనుగ్రహంతో ఈ రాశి వారు ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. అనేక విధాలుగా కలిసి వస్తుంది.
2.వృషభ రాశి:
వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ సమయంలో ఈ రాశి వారికి శుభఫలితాలు ఎదురవుతాయి. పని ప్రదేశంలో సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి.
3.వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఇది శుభ సమయం. ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికపరంగా లాభాలను పొందుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పాత సమస్యలు తొలగిపోతాయి. ఆస్తికి సంబంధించిన సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.
4.మకర రాశి:
{{/usCountry}}వృశ్చిక రాశి వారికి ఇది శుభ సమయం. ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికపరంగా లాభాలను పొందుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పాత సమస్యలు తొలగిపోతాయి. ఆస్తికి సంబంధించిన సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.
4.మకర రాశి:
{{/usCountry}}మకర రాశికి అధిపతి శని. ఈ సమయంలో దృష్టి యోగం కారణంగా ఈ రాశి వారు శుభఫలితాలను పొందుతారు. విజయాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఇది శుభసమయం. పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
5.మీన రాశి:
మీన రాశి వారికి ఇది శుభసమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. విజయాలను అందుకుంటారు. పాత సమస్యలు తొలగిపోతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. సక్సెస్‌ను అందుకుంటారు. ప్రేమ జీవితం కూడా సంతోషంగా మారుతుంది.