కార్తీక అమావాస్య 2025: కార్తీక మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈసారి కార్తీక అమావాస్య నవంబర్ 20 గురువారం నాడు వచ్చింది. కార్తీక అమావాస్య నాడు పూర్వికులను స్మరించుకోవడానికి, పూజించడానికి ఎంతో పవిత్రమైన రోజు. కార్తీక అమావాస్య నాడు పితృ దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు. పితృ దోషాలతో ఇబ్బంది పడుతున్న వారు కార్తీక అమావాస్య నాడు కొన్ని పరిహారాలను పాటించడం, దానధర్మాలు చేయడం వంటివి చేసినట్లయితే శుభ ఫలితాలు ఎదురవుతాయి. దోషాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు.
కార్తీక అమావాస్య శుభ ముహూర్తం:

పంచాంగం ప్రకారం కార్తీక మాసం కృష్ణపక్ష అమావాస్య గురువారం ఉదయం 9:43 కి మొదలవుతుంది, మధ్యాహ్నం 12:16 తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం అమావాస్యను చూడాలి. కనుక గురువారం నాడు అమావాస్య. అమావాస్య రోజున దానధర్మాలు చేయడం, పితృదేవతలను స్మరించుకోవడం మంచి రోజు. కార్తీక అమావాస్య నాడు బ్రహ్మముహూర్తాన్ని శక్తివంతమైనదిగా భావిస్తారు. తెల్లవారుజామున 4:00 నుంచి 5:54 దాకా బ్రహ్మముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో దాన ధర్మాలు చేసినా, నది స్నానాలు చేసినా ఎంతో పుణ్యం కలుగుతుంది.
కార్తీక అమావాస్య నాడు పూజ ఎలా చేసుకోవాలి?
- కార్తీక అమావాస్య నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి పూజ చేయాలి.
- కుదిరితే నది స్నానం చేయడం మంచిది.
- రాగి పాత్రలో నీళ్లు, కొద్దిగా పాలు, సింధూరం, ఎర్రటి పూలు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే మంచిది.
- శివ–కేశవుల్ని స్మరిస్తూ కార్తీక అమావాస్య నాడు పూజలు చేయాలి. పువ్వులు, పసుపు, చందనం, అక్షింతలు తో పాటు నైవేద్యాన్ని కూడా సమర్పించాలి.
కార్తీక అమావాస్య నాడు జపించాల్సిన మంత్రం:
కార్తీక అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తూ "ఓం పితృదేవతాయ నమః" అనే మంత్రాన్ని జపిస్తే పితృదేవతల అనుగ్రహం కలిగి సకల సంతోషాలు ఉంటాయి.
తర్పణాలు వదలాలి
కార్తీక అమావాస్య నాడు పూజ చేసిన తర్వాత పితృదేవతలకు తర్పణాలు వదలాలి. సాయంత్రం తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. వీలైతే పిండి దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వలన శాంతి, సంతోషం ఉంటాయి. పితృదేవతల అనుగ్రహం కూడా ఉంటుంది.
{{/usCountry}}కార్తీక అమావాస్య నాడు పూజ చేసిన తర్వాత పితృదేవతలకు తర్పణాలు వదలాలి. సాయంత్రం తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. వీలైతే పిండి దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వలన శాంతి, సంతోషం ఉంటాయి. పితృదేవతల అనుగ్రహం కూడా ఉంటుంది.
{{/usCountry}}గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.