రేపే కార్తీక అమావాస్య.. శుభ ముహూర్తం, పూజా విధానంతో పాటు పితృదేవతల అనుగ్రహం పొందాలంటే ఏ మంత్రం జపించాలో చూడండి!
ఈసారి కార్తీక అమావాస్య నవంబర్ 20 గురువారం నాడు వచ్చింది. కార్తీక అమావాస్య నాడు పూర్వికులను స్మరించుకోవడానికి, పూజించడానికి ఎంతో పవిత్రమైన రోజు. పితృ దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు. పితృ దోషాలతో ఇబ్బంది పడుతున్న వారు కార్తీక అమావాస్య నాడు కొన్ని పరిహారాలను పాటించడం మంచిది.
కార్తీక అమావాస్య 2025: కార్తీక మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈసారి కార్తీక అమావాస్య నవంబర్ 20 గురువారం నాడు వచ్చింది. కార్తీక అమావాస్య నాడు పూర్వికులను స్మరించుకోవడానికి, పూజించడానికి ఎంతో పవిత్రమైన రోజు. కార్తీక అమావాస్య నాడు పితృ దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు. పితృ దోషాలతో ఇబ్బంది పడుతున్న వారు కార్తీక అమావాస్య నాడు కొన్ని పరిహారాలను పాటించడం, దానధర్మాలు చేయడం వంటివి చేసినట్లయితే శుభ ఫలితాలు ఎదురవుతాయి. దోషాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు.

కార్తీక అమావాస్య శుభ ముహూర్తం:
పంచాంగం ప్రకారం కార్తీక మాసం కృష్ణపక్ష అమావాస్య గురువారం ఉదయం 9:43 కి మొదలవుతుంది, మధ్యాహ్నం 12:16 తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం అమావాస్యను చూడాలి. కనుక గురువారం నాడు అమావాస్య. అమావాస్య రోజున దానధర్మాలు చేయడం, పితృదేవతలను స్మరించుకోవడం మంచి రోజు. కార్తీక అమావాస్య నాడు బ్రహ్మముహూర్తాన్ని శక్తివంతమైనదిగా భావిస్తారు. తెల్లవారుజామున 4:00 నుంచి 5:54 దాకా బ్రహ్మముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో దాన ధర్మాలు చేసినా, నది స్నానాలు చేసినా ఎంతో పుణ్యం కలుగుతుంది.
కార్తీక అమావాస్య నాడు పూజ ఎలా చేసుకోవాలి?
- కార్తీక అమావాస్య నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి పూజ చేయాలి.
- కుదిరితే నది స్నానం చేయడం మంచిది.
- రాగి పాత్రలో నీళ్లు, కొద్దిగా పాలు, సింధూరం, ఎర్రటి పూలు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే మంచిది.
- శివ–కేశవుల్ని స్మరిస్తూ కార్తీక అమావాస్య నాడు పూజలు చేయాలి. పువ్వులు, పసుపు, చందనం, అక్షింతలు తో పాటు నైవేద్యాన్ని కూడా సమర్పించాలి.
కార్తీక అమావాస్య నాడు జపించాల్సిన మంత్రం:
కార్తీక అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తూ "ఓం పితృదేవతాయ నమః" అనే మంత్రాన్ని జపిస్తే పితృదేవతల అనుగ్రహం కలిగి సకల సంతోషాలు ఉంటాయి.
తర్పణాలు వదలాలి
కార్తీక అమావాస్య నాడు పూజ చేసిన తర్వాత పితృదేవతలకు తర్పణాలు వదలాలి. సాయంత్రం తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. వీలైతే పిండి దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వలన శాంతి, సంతోషం ఉంటాయి. పితృదేవతల అనుగ్రహం కూడా ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


