...
...
Next Story

వాస్తు చిట్కాలు: వాస్తు ప్రకారం ఈ 7 తప్పులు చేస్తే ఆరోగ్యం పాడవుతుంది.. వెంటనే ఈ మార్పులు చేయండి!

వాస్తు శాస్త్రం ప్రకారం మన దేహం యొక్క శక్తిని సంతులనం చేసే కొన్ని గుర్తులు, అలవాట్లు ఉంటాయి. గ్రంథాల ప్రకారం మన ఇంటి వాతావరణం, వస్తువుల సరైన దిశ మరియు కొన్ని రోజువారీ అలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకుంటే శరీరం మంచి సమతుల్యతను పొందుతుంది.

Published on: Mar 14, 2026, 12:00:17 IST
Advertisement

ఈ రోజుల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు సర్వసాధారణంగా మారాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, సరైన జీవనశైలి పాటించకపోవడం కారణంగా ఇది చాలా మందిలో కనిపిస్తుంది. కొన్ని జన్యుపరమైనవి కూడా ఉంటాయి. వాస్తు శాస్త్రం యొక్క కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఆరోగ్యంలో చాలా మార్పు వస్తుంది. ఆరోగ్యంగా ఉండచ్చు. ఎవరైనా సులభంగా చేయగలిగే కొన్ని నియమాలు వున్నాయి, ఇవన్నీ పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండచ్చు. అనారోగ్య సమస్యలు దూరంగా ఉండడానికి వీలవుతుంది.

వాస్తు చిట్కాలు: వాస్తు ప్రకారం ఈ 7 తప్పులు చేస్తే ఆరోగ్యం పాడవుతుంది (pinterest)
వాస్తు చిట్కాలు: వాస్తు ప్రకారం ఈ 7 తప్పులు చేస్తే ఆరోగ్యం పాడవుతుంది (pinterest)

వాస్తు శాస్త్రం ప్రకారం మన దేహం యొక్క శక్తిని సంతులనం చేసే కొన్ని గుర్తులు, అలవాట్లు ఉంటాయి. గ్రంథాల ప్రకారం మన ఇంటి వాతావరణం, వస్తువుల సరైన దిశ మరియు కొన్ని రోజువారీ అలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకుంటే శరీరం మంచి సమతుల్యతను పొందుతుంది. ఈ నియమాలను పాటించడం ద్వారా సానుకూలత కూడా జీవితంలో వస్తుంది. ఇది ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ఆరోగ్యం బాగుండాలంటే 7 నియమాలను పాటించండి

నైరుతి దిశ:

గ్రంథాల ప్రకారం ఇంటి యొక్క నైరుతి భాగంలోని వాస్తును మీరు సరిచేసినట్లయితే, ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి సహాయపడుతుంది. ఈ దిశ ఆరోగ్యానికి సంబంధించినదిగా భావిస్తారు. ఒకవేళ మీరు ఇక్కడ వాస్తును మెరుగుపరుచుకోగలిగితే, దాని నుంచి ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి.

పడకగదిలో ఈ పనిని చేయవద్దు:

మన జీవితంలో పడకగది వాస్తు ఎంతో ముఖ్యమైనది. ఇక్కడ విషయాలు సరిగ్గా ఉంటే సగానికి పైగా విషయాలు సరిగ్గా ఉంటాయి. వాస్తు శాస్త్రం యొక్క నిబంధనల ప్రకారం పడకగదిలో తినడం చేయకూడదు. ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను పాటించాలి. వాస్తు ప్రకారం పడకగదిలో ఆహారం తినడం వలన నష్టాలు కలుగుతాయి.

ఈ వస్తువును పడకగదిలో ఉంచవద్దు:

ఇప్పుడు వేసవి కూడా ప్రారంభమైంది. చాలా మంది ఫ్రిజ్ కంటే కుండ నుండి నీరు తాగడానికి ఇష్టపడతారు, ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మంచిది. ఇందులో ప్రతిరోజూ 7 తులసి ఆకులను జోడించండి.

ఇంట్లో తయారు చేసిన ఆహారం:

గ్రంథాల ప్రకారం ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినాలి. ఇంట్లో చేసిన ఆహారం తింటే ఆరోగ్యం కూడా బాగుంటుంది.

మీ తండ్రికి గౌరవం ఇవ్వండి:

మీ తండ్రికి చాలా ప్రేమ ఇవ్వండి. వారిని గౌరవించడానికి ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టవద్దు. మీరు మీ తండ్రిని ఎంత సంతోషంగా ఉంచితే అంత మంచిది.

ఈశాన్య కోణానికి సంబంధించిన నియమం:

ఇంటి యొక్క ఈ దిశ చాలా ముఖ్యమైనది. మీరు ఈ దిశలో ఇనుప వస్తువులను ఉంచినట్లయితే, వాటిని వెంటనే తొలగించండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks