చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి. అయితే చాలామంది ఇంట్లో ఏ దిశలో వేటిని పెడితే మంచి జరుగుతుందో తెలుసుకుని వాటిని అనుసరిస్తూ ఉంటారు.

ఇంటి ఉత్తరం వైపు కొన్నిటిని పెట్టడం వలన ఎంతో మంచి జరుగుతుంది. వాస్తు ప్రకారం ఉత్తరం దిశకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉత్తరం వైపు వీటిని పెట్టినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి నుంచి కూడా బయటపడవచ్చు.
వాస్తు ప్రకారం ఉత్తరం వైపు వీటిని పెడితే ఎంతో మంచి జరుగుతుంది
ఉత్తర దిశ కుబేరుని దిశ. ఈ దిశలో కొన్ని వస్తువులను ఉంచితే సంపద పెరుగుతుంది, సానుకూల ఆలోచనలు కలుగుతాయి. సానుకూల శక్తి ప్రవహించి ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి.
1.నీటి కుండ:
ఉత్తరం వైపు ఒక నీటి కుండను పెట్టండి. లేదంటే వాటర్ ఫౌంటెన్ వంటివి పెట్టొచ్చు. వీటిని ఉంచడం వలన మంచి ఆలోచనలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి, పనిలో ఉన్న సమస్యలన్నీ తొలగి పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
2.నది లేదా జలపాతం ఫోటోలు:
ఉత్తర దిశలో నది లేదా జలపాతం ఫోటోలు పెడితే కూడా సానుకూల శక్తి వ్యాపిస్తుంది. వీటిని ఉంచడం వలన ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి.
3.డబ్బు:
ఇంట్లో విలువైన వస్తువులను ఉత్తరం వైపు పెడితే సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఈ దిశలో డబ్బు, విలువైన వస్తువులు, బంగారం వంటివి పెట్టడం వలన దురదృష్టం కూడా తొలగిపోతుంది. సానుకూల శక్తి ప్రవేశించి ఇంట్లో పరిస్థితులు అన్నీ చక్కగా పడతాయి.
4.కుబేరుని విగ్రహం:
{{/usCountry}}ఇంట్లో విలువైన వస్తువులను ఉత్తరం వైపు పెడితే సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఈ దిశలో డబ్బు, విలువైన వస్తువులు, బంగారం వంటివి పెట్టడం వలన దురదృష్టం కూడా తొలగిపోతుంది. సానుకూల శక్తి ప్రవేశించి ఇంట్లో పరిస్థితులు అన్నీ చక్కగా పడతాయి.
4.కుబేరుని విగ్రహం:
{{/usCountry}}ఉత్తర దిశలో కుబేరుని విగ్రహం లేదా ఫోటోను పెడితే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. సంపద పెరుగుతుంది, ఆనందం ఎక్కువ అవుతుంది. కుబేరుని ఆశీస్సులు కూడా లభిస్తాయి.
5.ఆక్వేరియం:
ఉత్తర దిశలో ఆక్వేరియం లేదా చేపల తొట్టె వంటివి పెట్టడం వలన సానుకూల శక్తి వ్యాపించి చెడు శక్తులు తొలగిపోతాయి. డబ్బు కలుగుతుంది, అడ్డంకులన్నీ తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు, విజయాన్ని కూడా అందుకోవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.