నేటి నుండి డిసెంబర్ 19 వరకు వృశ్చిక రాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులను అదృష్టం వరిస్తుంది!
జాతకంలో శుక్ర గ్రహం శుభప్రదమైన లేదా బలమైన స్థితిలో ఉంటే, అప్పుడు సంతోషం, మంచి ప్రేమ జీవితాన్ని అనుభూతి చెందవచ్చు. శుక్రుడి సంచారం కొన్ని రాశులకు ప్రతికూల మార్గంలో ప్రభావితం చేస్తుంది. నేటి నుండి డిసెంబర్ 19 వరకు వృశ్చిక రాశిలో శుక్ర సంచారం ఉంటుంది. ఇది కొన్ని రాశులకు ఎక్కువ లాభాలు తీసుకొస్తుంది.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. శుక్రుడు కూడా కాలానుగుణంగా తన రాశులను మారుస్తూ ఉంటాడు. శుక్రుడు రాశి మార్పు చెందినప్పుడు, అది ద్వాదశ రాశుల వారి జీవితంపై అనేక ప్రభావాలను, అనేక విధాలుగా మార్పులను తీసుకొస్తుంది.

శుక్రుడు సంపద, ప్రేమ, అందం, విలాసాలు, కళలు మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు రాశి మార్పు జరిగినప్పుడు అనేక రకాల మార్పులు మన జీవితంలో చోటుచేసుకుంటాయి. ఈరోజు నవంబర్ 26న శుక్రుడు రాశి మార్పు చెందాడు. ఇది ద్వాదశ రాశుల వారికి అనేక విధాలుగా మార్పులను కలిగిస్తుంది. కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు.
శుక్ర సంచారంలో మార్పు
జాతకంలో శుక్ర గ్రహం శుభప్రదమైన లేదా బలమైన స్థితిలో ఉంటే, అప్పుడు సంతోషం, మంచి ప్రేమ జీవితాన్ని అనుభూతి చెందవచ్చు. శుక్రుడి సంచారం కొన్ని రాశులకు ప్రతికూల మార్గంలో ప్రభావితం చేస్తుంది. పంచాంగం ప్రకారం, నవంబర్ 26 న ఉదయం 11:27 గంటలకు, శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశికి అధిపతి కుజుడు.శుక్రుడు డిసెంబర్ 19 వరకు ఈ రాశిలోనే ఉండబోతున్నాడు. అటువంటి పరిస్థితిలో, శుక్రుడి సంచారం కొన్ని రాశిచక్రాలకు మంచి లాభాలను ఇస్తుంది.
వృశ్చిక రాశిలో శుక్రుడు సంచారం.. ఈ రాశులకు అనేక లాభాలు
1.మిథున రాశి
నేటి నుండి డిసెంబర్ 19 వరకు వృశ్చిక రాశిలో శుక్రుడు సంచారం చేస్తారు. ఇది మిథున రాశి వారికి అనేక లాభాలను అందిస్తుంది. వృశ్చిక రాశిలో శుక్రుడు సంచారం మిథున రాశి ప్రజలకు శుభవార్తను ఇస్తుంది, ఆర్థిక లాభాలు పొందవచ్చు. ప్రేమ జీవితం అనందం ఉంటుంది. కెరీర్ కి సంబంధించిన ముఖ్యమైన పనులను కూడా కనుగొనవచ్చు. కొందరి వివాహం నిశ్చయం అవ్వచ్చు. కొంతమంది కొత్త వ్యక్తులను కలవడం కూడా సాధ్యమే.
2.వృషభ రాశి
వృషభ రాశి వారికి శుక్ర సంచారం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. మీరు మీ భాగస్వామి నిర్ణయానికి ప్రాముఖ్యత ఇస్తారు. కొత్త సంపాదన వనరులు దొరుకుతాయి. ఒంటరి వ్యక్తులకు సమయం ప్రత్యేకంగా ఉంటుంది. వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి. మీరు కుటుంబం నుండి కొన్ని శుభవార్తలను పొందవచ్చు. మీరు స్నేహితులతో మంచి సమయాన్ని గడపవచ్చు.
3.కుంభ రాశి
ఈ రాశి వారికి శుక్ర సంచారం కుంభ రాశి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు మీ క్రష్ నుండి సానుకూల ప్రతిస్పందనను పొందవచ్చు. అదృష్టం పెరుగుతుంది. సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది. మీరు సృజనాత్మక శక్తితో నిండిన అనుభూతి చెందుతారు. డబ్బు సంపాదించవచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


