జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువును విద్య, జ్ఞానం, సంపద, ధర్మం మొదలైన వాటికి కారకుడిగా భావిస్తారు. జాతకంలో గురువు బలంగా ఉన్నట్లయితే సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి.

అదే గురు గ్రహం బలహీనంగా ఉన్నట్లయితే విద్య, ఆర్థిక పరిస్థితులు, వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. జాతకంలో గురు గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు కనిపించే సంకేతాలు ఏంటి? గురు గ్రహాన్ని బలోపేతం చేయడానికి ఎలాంటి పరిహారాలను పాటిస్తే మంచిది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గురు గ్రహం బలహీనంగా ఉంటే కనిపించే సంకేతాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, జాతకంలో గురు గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితంలో కొన్ని రకాల సమస్యలు వస్తాయి.
విద్యలో ఆటంకాలు:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహాన్ని జ్ఞానం, విద్యకు కారకుడిగా భావిస్తారు. జాతకంలో గురువు బలహీనంగా ఉన్నప్పుడు చదువుపై ఆసక్తి తగ్గుతుంది. ఏకాగ్రత కూడా లోపిస్తుంది. విద్యకు సంబంధించిన విషయాల్లో ఆటంకాలు ఎదురవుతాయి.
గౌరవం తగ్గడం:
గురు గ్రహం జ్ఞానానికి, గౌరవానికి ప్రతీక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువు బలహీనంగా ఉన్నట్లయితే గౌరవం తగ్గి, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంత కష్టపడి పని చేసినా శ్రమకు తగిన గుర్తింపు లభించదు.
వివాహం ఆలస్యం:
జాతకంలో గురువు బలహీనంగా ఉంటే వివాహంలో ఆలస్యం జరుగుతుంది. అందువల్ల జాతకంలో గురు గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు పరిహారాలను పాటించాలి. వైవాహిక జీవితంలో సమస్యలు, ఒత్తిళ్లు కూడా గురువు బలహీనంగా ఉన్నప్పుడు ఎదురవుతూ ఉంటాయి.
నిర్ణయాలు తీసుకోవడంలో సమస్యలు:
గురు గ్రహాన్ని వివేకానికి, సరైన మార్గదర్శకత్వానికి కారకుడిగా చెబుతారు. జాతకంలో గురువు బలహీనంగా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. మంచి చెడులను గుర్తించడంలో, సరైన మార్గాన్ని ఎంచుకోవడంలో కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
గురు గ్రహాన్ని బలోపేతం చేయడానికి ఈ పరిహారాలను పాటించండి
విష్ణువును ఆరాధించండి:
గురు గ్రహం బలహీనంగా ఉంటే విష్ణువును పూజించండి. భక్తిశ్రద్ధలతో విష్ణువును పూజించడం వల్ల శుభాలు కలుగుతాయి. అలాగే స్వామివారికి పసుపు రంగు పూలు, పండ్లు సమర్పించండి. ఇలా చేస్తే గురు గ్రహాన్ని బలోపేతం చేయడంతో పాటు అశుభ ప్రభావాలను కూడా తగ్గించుకోవడానికి వీలవుతుంది.
పసుపు రంగు వస్తువులను దానం చేయాలి:
{{/usCountry}}గురు గ్రహం బలహీనంగా ఉంటే విష్ణువును పూజించండి. భక్తిశ్రద్ధలతో విష్ణువును పూజించడం వల్ల శుభాలు కలుగుతాయి. అలాగే స్వామివారికి పసుపు రంగు పూలు, పండ్లు సమర్పించండి. ఇలా చేస్తే గురు గ్రహాన్ని బలోపేతం చేయడంతో పాటు అశుభ ప్రభావాలను కూడా తగ్గించుకోవడానికి వీలవుతుంది.
పసుపు రంగు వస్తువులను దానం చేయాలి:
{{/usCountry}}జాతకంలో గురువు బలహీనంగా ఉన్నట్లయితే పసుపు రంగు వస్తువులను దానం చేయాలి. శనగపప్పు, పసుపు రంగు వస్త్రాలు ఇలాంటివి దానం చేయడం వల్ల శుభ ఫలితాలను చూడవచ్చు.
గురు మంత్రాన్ని జపించాలి:
గురు గ్రహాన్ని బలోపేతం చేయడానికి గురు మంత్రాన్ని జపించండి. గురువారం నాడు గురు మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది.