గురు గ్రహం బలహీనంగా ఉందా? మీ జీవితంలో కనిపించే ఈ 4 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహాన్ని విద్య, జ్ఞానం, సంపద, ధర్మం, వివాహం, అదృష్టానికి కారకుడిగా భావిస్తారు. జాతకంలో గురువు బలహీనంగా ఉన్నప్పుడు విద్య, ఆర్థిక పరిస్థితులు, గౌరవం, వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయని జ్యోతిష్య విశ్వాసం. 

Published on: Nov 6, 2026, 14:03:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువును విద్య, జ్ఞానం, సంపద, ధర్మం మొదలైన వాటికి కారకుడిగా భావిస్తారు. జాతకంలో గురువు బలంగా ఉన్నట్లయితే సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి.

గురు గ్రహం బలహీనంగా ఉందా? మీ జీవితంలో కనిపించే ఈ 4 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
గురు గ్రహం బలహీనంగా ఉందా? మీ జీవితంలో కనిపించే ఈ 4 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

అదే గురు గ్రహం బలహీనంగా ఉన్నట్లయితే విద్య, ఆర్థిక పరిస్థితులు, వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. జాతకంలో గురు గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు కనిపించే సంకేతాలు ఏంటి? గురు గ్రహాన్ని బలోపేతం చేయడానికి ఎలాంటి పరిహారాలను పాటిస్తే మంచిది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గురు గ్రహం బలహీనంగా ఉంటే కనిపించే సంకేతాలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, జాతకంలో గురు గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితంలో కొన్ని రకాల సమస్యలు వస్తాయి.

విద్యలో ఆటంకాలు:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహాన్ని జ్ఞానం, విద్యకు కారకుడిగా భావిస్తారు. జాతకంలో గురువు బలహీనంగా ఉన్నప్పుడు చదువుపై ఆసక్తి తగ్గుతుంది. ఏకాగ్రత కూడా లోపిస్తుంది. విద్యకు సంబంధించిన విషయాల్లో ఆటంకాలు ఎదురవుతాయి.

గౌరవం తగ్గడం:

గురు గ్రహం జ్ఞానానికి, గౌరవానికి ప్రతీక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువు బలహీనంగా ఉన్నట్లయితే గౌరవం తగ్గి, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంత కష్టపడి పని చేసినా శ్రమకు తగిన గుర్తింపు లభించదు.

వివాహం ఆలస్యం:

జాతకంలో గురువు బలహీనంగా ఉంటే వివాహంలో ఆలస్యం జరుగుతుంది. అందువల్ల జాతకంలో గురు గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు పరిహారాలను పాటించాలి. వైవాహిక జీవితంలో సమస్యలు, ఒత్తిళ్లు కూడా గురువు బలహీనంగా ఉన్నప్పుడు ఎదురవుతూ ఉంటాయి.

నిర్ణయాలు తీసుకోవడంలో సమస్యలు:

గురు గ్రహాన్ని వివేకానికి, సరైన మార్గదర్శకత్వానికి కారకుడిగా చెబుతారు. జాతకంలో గురువు బలహీనంగా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. మంచి చెడులను గుర్తించడంలో, సరైన మార్గాన్ని ఎంచుకోవడంలో కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

గురు గ్రహాన్ని బలోపేతం చేయడానికి ఈ పరిహారాలను పాటించండి

విష్ణువును ఆరాధించండి:

గురు గ్రహం బలహీనంగా ఉంటే విష్ణువును పూజించండి. భక్తిశ్రద్ధలతో విష్ణువును పూజించడం వల్ల శుభాలు కలుగుతాయి. అలాగే స్వామివారికి పసుపు రంగు పూలు, పండ్లు సమర్పించండి. ఇలా చేస్తే గురు గ్రహాన్ని బలోపేతం చేయడంతో పాటు అశుభ ప్రభావాలను కూడా తగ్గించుకోవడానికి వీలవుతుంది.

పసుపు రంగు వస్తువులను దానం చేయాలి:

జాతకంలో గురువు బలహీనంగా ఉన్నట్లయితే పసుపు రంగు వస్తువులను దానం చేయాలి. శనగపప్పు, పసుపు రంగు వస్త్రాలు ఇలాంటివి దానం చేయడం వల్ల శుభ ఫలితాలను చూడవచ్చు.

గురు మంత్రాన్ని జపించాలి:

గురు గ్రహాన్ని బలోపేతం చేయడానికి గురు మంత్రాన్ని జపించండి. గురువారం నాడు గురు మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More