చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సమస్యలన్నీ తొలగిపోతాయి. వాస్తు దోషాలు కూడా తొలగి ఆనందంగా ఉండొచ్చు. వాస్తు ప్రకారం అనుసరిస్తే సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది, ప్రత్యేక క్షణం. పెళ్లికి సంబంధించి కూడా కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. ముఖ్యంగా పెళ్లి కార్డు విషయంలో కొన్ని నియమాలను తప్పక పాటించడం మంచిది. అలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

ప్రతి ఒక్కరు వివాహానికి సంబంధించిన ప్రతిదీ పరిపూర్ణంగా, మనసుకు అనుగుణంగా ఉండాలని అనుకుంటారు. పెళ్లి వేదిక, అతిథులు, అలంకరణ, దుస్తులు, బహుమతులు, పెళ్లి కార్డులు. వీటన్నిటి కోసం చాలా నెలల ముందే పనులు మొదలుపెడతారు. అయితే ఈ సమయంలో చాలామంది పెళ్లి కార్డుకు సంబంధించిన నియమాలను కూడా పాటిస్తూ ఉంటారు. మరి పెళ్లి కార్డుకు సంబంధించి ఎలాంటి నియమాలను పాటించాలి? పెళ్లి కార్డు ఏ రంగులో ఉంటే మంచిది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లి కార్డు విషయంలో పాటించాల్సిన వాస్తు నియమాలు
1.వినాయకుడు ముందు పెట్టాలి:
పెళ్లి కార్డును మొట్టమొదట వినాయకుడిని పూజించే స్థలంలో, వినాయకుడు ముందు పెట్టాలి. ఏదైనా శుభకార్యానికి ముందు కచ్చితంగా వినాయకుడిని పూజించాలి. విఘ్నాలను తొలగించే వినాయకుడిని ఆరాధించి ఏదైనా పనిని మొదలుపెడితే అడ్డంకులు, విఘ్నాలు లేకుండా ఆ పనులు విజయవంతంగా పూర్తవుతాయని నమ్ముతారు.
కాబట్టి మొట్టమొదట పెళ్లి కార్డును వినాయకుడు ముందు పెట్టి, ఆ తర్వాత ఇతరులకు ఇవ్వాలి. వినాయకుడిని ఎప్పుడైనా ఆరాధించి ఆయన ముందు పెళ్లి కార్డు పెట్టొచ్చు. ముఖ్యంగా గురువారం నాడు ఇలా చేయడం చాలా శుభప్రదం. గురువారం గురు గ్రహానికి సంబంధించినది. వివాహం, కెరియర్ కి గురువు కారకుడు.
2.వాస్తు ప్రకారం ఏ రంగు కార్డు శుభప్రదం?
వాస్తు ప్రకారం పెళ్లి కార్డును ప్రింట్ చేసేటప్పుడు కొన్ని రంగులు బాగా కలిసి వస్తాయి. ఈ రంగుల పెళ్లి కార్డులను ప్రింట్ చేయించడం వలన అదృష్టం కూడా కలిసి వస్తుంది. పెళ్లి కార్డులు ఎరుపు, మెరూన్, గులాబీ, పసుపు, బంగారం లేదా క్రీమ్ కలర్ లో ఉంటే అత్యంత శుభప్రదం. ఇవి అదృష్టానికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు.
3.కార్డును ఈ దిశలో పెట్టడం మంచిది
{{/usCountry}}వాస్తు ప్రకారం పెళ్లి కార్డును ప్రింట్ చేసేటప్పుడు కొన్ని రంగులు బాగా కలిసి వస్తాయి. ఈ రంగుల పెళ్లి కార్డులను ప్రింట్ చేయించడం వలన అదృష్టం కూడా కలిసి వస్తుంది. పెళ్లి కార్డులు ఎరుపు, మెరూన్, గులాబీ, పసుపు, బంగారం లేదా క్రీమ్ కలర్ లో ఉంటే అత్యంత శుభప్రదం. ఇవి అదృష్టానికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు.
3.కార్డును ఈ దిశలో పెట్టడం మంచిది
{{/usCountry}}పెళ్లి కార్డులు ప్రింట్ చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈశాన్యం మూలలో పెడితే చాలా మంచి జరుగుతుంది. ఇంటి దిక్కుల్లో అత్యంత శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి ఈ దిశలో పెళ్లి కార్డులను పెట్టి ఉంచితే చక్కటి ఫలితాలు వస్తాయని చూస్తారు. ఈ దిశలో దేవుళ్లు, దేవతలు ఉంటారని అంటారు. చాలా మంది పెళ్లి కార్డులపై ఏదైనా సామాన్లను పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. అలా చేయడం వలన సానుకూల శక్తి దెబ్బతింటుంది.