...
...
Next Story

జయ ఏకాదశి జనవరి 28న, 29న? తేదీ, పూజా ముహూర్తంతో పాటు తులసి పరిహారాలు తెలుసుకోండి!

ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్ల పక్షంలో, మరొకటి కృష్ణ పక్షంలో వస్తాయి. ప్రస్తుతం మాఘమాసం నడుస్తోంది. మాఘ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని జయ ఏకాదశిగా జరుపుకుంటాము. ఆ రోజున భక్తి శ్రద్ధలతో విష్ణువును ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

Published on: Jan 23, 2026, 13:31:17 IST
Advertisement

ఏకాదశి తిథికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏకాదశి నాడు భక్తి శ్రద్ధలతో విష్ణువును ఆరాధిస్తే శుభఫలితాలు కలుగుతాయి. ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్ల పక్షంలో, మరొకటి కృష్ణ పక్షంలో వస్తాయి. ప్రస్తుతం మాఘమాసం నడుస్తోంది. మాఘ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని జయ ఏకాదశిగా జరుపుకుంటాము.

జయ ఏకాదశి జనవరి 28న, 29న? (pinterest)
జయ ఏకాదశి జనవరి 28న, 29న? (pinterest)

ఆ రోజున భక్తి శ్రద్ధలతో విష్ణువును ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే సంతోషం, సంపద, అదృష్టం కూడా లభిస్తాయి. గంగా నదిలో స్నానం చేసి విష్ణువును ఆరాధించడం వలన శుభఫలితాలు పొందవచ్చు.

జయ ఏకాదశి 2026

2026 పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి జనవరి 28 సాయంత్రం 4:35 గంటలకు ప్రారంభమై, జనవరి 29 మధ్యాహ్నం 1:55 గంటలకు ముగుస్తుంది. దీంతో జయ ఏకాదశి ఉపవాసం, వ్రతాన్ని జనవరి 29న జరుపుకోవాలి. ఉపవాసాన్ని జనవరి 30న విరమించాలి. ఇలా చేయడం వలన మోక్షం లభిస్తుంది.

పూర్వీకులకు మోక్షం

జయ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పూర్వీకులకు మోక్షం లభిస్తుంది. కుటుంబంలో అనారోగ్య సమస్యలు, పనిలో ఓటములు, ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు ఉంటే పూర్వీకులు సంతోషంగా లేరని అర్థం. అలాంటి సమయంలో ఏకాదశి నాడు ఈ విధంగా పాటించడం వలన పూర్వీకులకు మోక్షం కలుగుతుంది.

జయ ఏకాదశి నాడు ఈ తులసి పరిహారాలను పాటించండి

జయ ఏకాదశి నాడు స్నానం చేసిన తర్వాత పచ్చిపాలలో కొద్దిగా పచ్చిపాలను తులసి మొక్కకు సమర్పించండి. ఆ తర్వాత తులసమ్మను ఆరాధించండి. ఇలా చేయడం వలన వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వలన విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆనందంగా ఉండవచ్చు.

జయ ఏకాదశి నాడు ఇవి కూడా పాటించండి

జయ ఏకాదశి నాడు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. దీని వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది.

పెద్దలను గౌరవించాలి. వారిపై కోప్పడడం, దూషించడం వంటివి చెయ్యకూడదు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe