పోలాల అమావాస్య లేదా పోలంబా వ్రతాన్ని ప్రతి ఏటా శ్రావణ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో జరుపుతారు. తల్లులు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, ఆయుష్షు, క్షేమం కలగాలని కోరుతూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే, ఈ వ్రతాన్ని ఆచరించడం వలన సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యం కలుగుతుంది. ఈ ఏడాది పోలాల అమావాస్య ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటుగా పూజా విధానం గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పోలాల అమావాస్య 2026 తేదీ, సమయం

ఈ సంవత్సరం పోలాల అమావాస్య సెప్టెంబర్ 11, శుక్రవారం నాడు వచ్చింది.
అమావాస్య తిథి ప్రారంభం: సెప్టెంబర్ 10, గురువారం ఉదయం 10:33
అమావాస్య తిథి ముగింపు: సెప్టెంబర్ 11, శుక్రవారం ఉదయం 8:56
శుభ సమయం: ఉదయం 4:30 నుంచి 8:25 మరియు 9:30 నుంచి 10:35
పోలాల అమావాస్య 2026 పూజా విధానం
1.ఇంటిని శుభ్రం చేయండి:
ఉదయాన్నే నిద్రలేచి, తలస్నానం చేసి, పూజా స్థలాన్ని శుభ్రం చేసి పూజ గదిలో ముగ్గు వేయండి.
2.కంద మొక్క:
కుటుంబ సంప్రదాయం ప్రకారం పూజ గదిలో కంద మొక్కను ఉంచి, దానికి పసుపు కొమ్ములు, దారం కట్టండి.
3.గణపతి పూజ:
ముందు విఘ్నాలు తొలగించే వినాయకుని ప్రార్థించాలి. ఆ తర్వాత అమ్మవారిని ఆరాధించాలి.
4.అమ్మవారి ఆవాహన:
కంద మొక్కలో మంగళ గౌరీ దేవి, సంతాన లక్ష్మీదేవిని ఆవాహనం చేసి అమ్మవారిని పూజించాలి. అమ్మవారి మట్టి విగ్రహం లేదా కలశాన్ని ఏర్పాటు చేసి పూజిస్తారు.
5.పసుపు, కుంకుమలు:
అమ్మవారికి పసుపు, కుంకుమలు, అక్షింతలు, పూలను సమర్పిస్తారు. పార్వతీ దేవి అష్టోత్తరం లేదా అమ్మవారి స్తోత్రాలను చదువుకుంటే మంచిది.
6.తోరం పూజ:
దారానికి పసుపు రాసి, పసుపు కొమ్ము కట్టి అమ్మవారికి సమర్పించాలి. పూజ చేశాక తోరాన్ని పిల్లలకు కూడా కట్టాలి. అలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా వుంటారు.
7.వ్రత కథ:
{{/usCountry}}దారానికి పసుపు రాసి, పసుపు కొమ్ము కట్టి అమ్మవారికి సమర్పించాలి. పూజ చేశాక తోరాన్ని పిల్లలకు కూడా కట్టాలి. అలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా వుంటారు.
7.వ్రత కథ:
{{/usCountry}}పోలాంబ లేదా పోలేరమ్మ అమ్మవారి వ్రతకథను భక్తి శ్రద్ధలతో చదవడం లేదా వినడం మంచిది. ఇలా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది.
8.నైవేద్యం:
అమ్మ వారికి కుడుములు, ఉండ్రాళ్లు, పూర్ణం బూరెలు, పాయసం, చలిమిడి, పెరుగు అన్నం, పండ్లు వంటివి సమర్పిస్తారు. కొంత మంది వివిధ రకాల కూరలు వేసి పులుసు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. పూజ అయిపోయాక ముత్తైదువులకు వాయనం, తాంబూలం, దక్షిణ ఇస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి, క్షమాప్రార్థన చెప్పండి.