పోలాల అమావాస్య సెప్టెంబర్ 10న, 11న? తేదీ, సమయం, పూజా విధానం.. కంద మొక్క, తోరం, నైవేద్యం వివరాలు!
పోలాల అమావాస్య లేదా పోలంబా వ్రతాన్ని శ్రావణ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో సంప్రదాయంగా ఆచరిస్తారు. ముఖ్యంగా తల్లులు తమ పిల్లలు ఆరోగ్యంగా, ఆయుష్షుతో, క్షేమంగా ఉండాలని కోరుతూ ఈ వ్రతాన్ని చేస్తారు. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని కూడా విశ్వసిస్తారు.
పోలాల అమావాస్య లేదా పోలంబా వ్రతాన్ని ప్రతి ఏటా శ్రావణ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో జరుపుతారు. తల్లులు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, ఆయుష్షు, క్షేమం కలగాలని కోరుతూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే, ఈ వ్రతాన్ని ఆచరించడం వలన సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యం కలుగుతుంది. ఈ ఏడాది పోలాల అమావాస్య ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటుగా పూజా విధానం గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పోలాల అమావాస్య 2026 తేదీ, సమయం
ఈ సంవత్సరం పోలాల అమావాస్య సెప్టెంబర్ 11, శుక్రవారం నాడు వచ్చింది.
అమావాస్య తిథి ప్రారంభం: సెప్టెంబర్ 10, గురువారం ఉదయం 10:33
అమావాస్య తిథి ముగింపు: సెప్టెంబర్ 11, శుక్రవారం ఉదయం 8:56
శుభ సమయం: ఉదయం 4:30 నుంచి 8:25 మరియు 9:30 నుంచి 10:35
పోలాల అమావాస్య 2026 పూజా విధానం
1.ఇంటిని శుభ్రం చేయండి:
ఉదయాన్నే నిద్రలేచి, తలస్నానం చేసి, పూజా స్థలాన్ని శుభ్రం చేసి పూజ గదిలో ముగ్గు వేయండి.
2.కంద మొక్క:
కుటుంబ సంప్రదాయం ప్రకారం పూజ గదిలో కంద మొక్కను ఉంచి, దానికి పసుపు కొమ్ములు, దారం కట్టండి.
3.గణపతి పూజ:
ముందు విఘ్నాలు తొలగించే వినాయకుని ప్రార్థించాలి. ఆ తర్వాత అమ్మవారిని ఆరాధించాలి.
4.అమ్మవారి ఆవాహన:
కంద మొక్కలో మంగళ గౌరీ దేవి, సంతాన లక్ష్మీదేవిని ఆవాహనం చేసి అమ్మవారిని పూజించాలి. అమ్మవారి మట్టి విగ్రహం లేదా కలశాన్ని ఏర్పాటు చేసి పూజిస్తారు.
5.పసుపు, కుంకుమలు:
అమ్మవారికి పసుపు, కుంకుమలు, అక్షింతలు, పూలను సమర్పిస్తారు. పార్వతీ దేవి అష్టోత్తరం లేదా అమ్మవారి స్తోత్రాలను చదువుకుంటే మంచిది.
6.తోరం పూజ:
దారానికి పసుపు రాసి, పసుపు కొమ్ము కట్టి అమ్మవారికి సమర్పించాలి. పూజ చేశాక తోరాన్ని పిల్లలకు కూడా కట్టాలి. అలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా వుంటారు.
7.వ్రత కథ:
పోలాంబ లేదా పోలేరమ్మ అమ్మవారి వ్రతకథను భక్తి శ్రద్ధలతో చదవడం లేదా వినడం మంచిది. ఇలా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది.
8.నైవేద్యం:
అమ్మ వారికి కుడుములు, ఉండ్రాళ్లు, పూర్ణం బూరెలు, పాయసం, చలిమిడి, పెరుగు అన్నం, పండ్లు వంటివి సమర్పిస్తారు. కొంత మంది వివిధ రకాల కూరలు వేసి పులుసు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. పూజ అయిపోయాక ముత్తైదువులకు వాయనం, తాంబూలం, దక్షిణ ఇస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి, క్షమాప్రార్థన చెప్పండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


