హిందూ ధర్మంలో పవిత్రమైన వ్రతం స్కంద షష్టి. ఈ వ్రతం పరమశివుడు, పార్వతీదేవి పెద్దకొడుకు, దేవసేనాధిపతి అయినటువంటి కార్తికేయ స్వామికి అంకితం చేయబడింది. ప్రతి నెలలో కూడా శుక్లపక్ష షష్టి నాడు స్కంద షష్టి జరుపుకుంటాము. భక్తిశ్రద్ధలతో ఈ ఉపవాసం ఉన్నట్లయితే కార్తికేయుని అనుగ్రహం కలిగి కష్టాల నుంచి బయటపడవచ్చు. ధైర్యం, విజయాలు లభిస్తాయని కూడా విశ్వాసం. అధిక జ్యేష్ఠ మాసంలో స్కంద షష్టి ఎప్పుడు వచ్చింది? తేదీ, శుభ ముహూర్తంతో పాటు వ్రత విధానం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
మే 2026 తేదీ, శుభ ముహూర్తం:

పంచాంగం ప్రకారం చూసినట్లయితే, అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్ష షష్టి తిథి మే 21, అనగా రేపు ఉదయం 8:27కి ప్రారంభమవుతుంది. మే 22 ఉదయం 6:25తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం చూసినట్లయితే, స్కంద షష్టి వ్రతాన్ని మే 21, అనగా రేపు ఆచరించాలి.
పూజా విధానం:
- వ్రతం ఆచరించాలనుకునేవారు తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు కట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది.
- పూజ గదిలో శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టి పూజించాలి. ఉపవాస సంకల్పం చేసుకోవాలి.
- సుబ్రహ్మణ్యస్వామికి కుంకుమ, గంధం, అక్షింతలు, పసుపు, పువ్వులు, పండ్లు, ధూపం, దీపం సమర్పించండి. చివరగా పండ్లు లేదా స్వీట్లు నైవేద్యంగా సమర్పించండి.
ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచిది:
“ఓం శరవణ భవాయ నమః”
ఈ మంత్రాన్ని జపించడం వలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు స్కంద షష్టి కవచం పారాయణం చేస్తే ఎంతో శుభ ఫలితం కలుగుతుంది. ప్రతికూల శక్తి ఏమైనా ఉంటే కూడా తొలగిపోతుంది. కర్పూరం లేదా దీపంతో హారతి ఇచ్చి స్వామి అనుగ్రహాన్ని పొందండి.
ఆధ్యాత్మిక ప్రాముఖ్యత:
పురాణాల ప్రకారం చూసినట్లయితే, ఈ పవిత్ర దినాన కార్తికేయుడు తారకాసురుడు, సూరపద్ముడు అనే రాక్షసులను సంహరించి వారి పీడ నుంచి దేవతలను విముక్తి చేశాడు. అందుకే ఆయనను యుద్ధ దేవుడు అని కూడా అంటారు. ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారి పిల్లలకు దీర్ఘాయుష్షు కలుగుతుందని విశ్వాసం. కార్తికేయ స్వామి కుజగ్రహాధిపతి కనుక కార్తికేయుడ్ని ఆరాధించడం వలన జాతకంలో కుజదోషాలు కూడా తొలగిపోతాయి.
ఈ సుబ్రహ్మణ్య శ్లోకాలు కూడా చదువుకోండి
{{/usCountry}}పురాణాల ప్రకారం చూసినట్లయితే, ఈ పవిత్ర దినాన కార్తికేయుడు తారకాసురుడు, సూరపద్ముడు అనే రాక్షసులను సంహరించి వారి పీడ నుంచి దేవతలను విముక్తి చేశాడు. అందుకే ఆయనను యుద్ధ దేవుడు అని కూడా అంటారు. ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారి పిల్లలకు దీర్ఘాయుష్షు కలుగుతుందని విశ్వాసం. కార్తికేయ స్వామి కుజగ్రహాధిపతి కనుక కార్తికేయుడ్ని ఆరాధించడం వలన జాతకంలో కుజదోషాలు కూడా తొలగిపోతాయి.
ఈ సుబ్రహ్మణ్య శ్లోకాలు కూడా చదువుకోండి
{{/usCountry}}ఈ శ్లోకాలను చదువుకుంటే ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కుజదోష ప్రభావం నుంచి కూడా బయటపడచ్చు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, ఆయుష్షు పెరుగుతుంది. అడ్డంకులు తొలగిపోయి విజయాలు కలుగుతాయి. ప్రతికూల శక్తి దూరమై సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
ఓం తత్పురుషాయ విద్మహే
మహాసేనాయ ధీమహి
తన్నో షణ్ముఖః ప్రచోదయాత్..
షడాననం కుంకుమ రక్తవర్ణం
మహామతిం దివ్య మయూరవాహనం
రుద్రస్య సూనుం సురసైన్యనాథం
గుహం సదాహం శరణం ప్రపద్యే..
మంగళం శక్తి హస్తాయ
మంగళం మయూరవాహనాయ
మంగళం స్కందరూపాయ
సుబ్రహ్మణ్యాయ మంగళమ్..