శని జయంతి నాడు ఈ 3 రాశుల వారికి శని యోగం.. ఇక డబ్బే డబ్బు, తిరుగులేని విజయాలు!
న్యాయదేవుడైన శని దేవుడు మనం చేసే కర్మలను బట్టే ఫలితాలను ఇస్తాడు. ఈ ఏడాది మే 16న శని జయంతి సందర్భంగా కొన్ని రాశుల వారిపై శని దేవుడి ప్రత్యేక అనుగ్రహం ఉండబోతోంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఆర్థిక కష్టాలు తీరిపోవడమే కాకుండా, రాజభోగాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలు కలుగుతాయి. ఈ ఏడాది శనిజయంతి మే 16న వచ్చింది. ఆ రోజు కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోంది. శని జయంతి వేళ ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది, ఏ రాశుల వారు ఏ విధమైన లాభాలను పొందుతారు, శని అనుగ్రహంతో సంతోషంగా ఎవరు ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

ఈ ఏడాది శని జయంతి వేళ ఈ రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోంది.. అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి
1.మకర రాశి:
మకర రాశికి అధిపతి శని దేవుడు. ఈ శని జయంతి వేళ ఈ రాశి వారికి బాగా కలిసి రాబోతోంది. విశేషమైన ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక పరంగా ప్రయోజనాలు ఉంటాయి. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి.
కొత్త ఇల్లు లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థికపరంగా మెరుగుదల కనిపిస్తుంది. కష్టపడితే అందరి ప్రశంసలు పొందుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులు ఈ సమయంలో వ్యాపారంలో సానుకూల మార్పులను చూస్తారు. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు.
2.కుంభ రాశి:
కుంభ రాశి వారికి కూడా ఈ శని జయంతి సమయంలో బాగా కలిసి వస్తుంది. సానుకూల మార్పులు కనిపిస్తాయి. అనేక విధాలుగా ప్రయోజనాలు ఉంటాయి. ఈ రాశికి కూడా అధిపతి శని దేవుడే. ఈ సమయంలో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
వివాహానికి సంబంధించిన అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్‌లో కూడా బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా ఈ శనిజయంతి బావుంటుంది.
3.మీన రాశి:
మీన రాశి వారు శనిజయంతి సందర్భంగా శుభ ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా అనేక ప్రయోజనాలు ఉంటాయి. శని అనుగ్రహంతో ఈ రాశి వారు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు.
ముఖ్యమైన ప్రాజెక్టులను సమయానికి పూర్తిచేస్తారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. అన్ని విధాలుగా కూడా ఈ సమయం ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


