స్కంద షష్ఠి మే 21న, 22న? తేదీ, శుభ ముహూర్తం, ప్రాముఖ్యత, పూజా విధానంతో పాటు చదువుకోవాల్సిన మంత్రాలు ఇవిగో!

ప్రతీ నెలలో వచ్చే శుక్లపక్ష షష్టినీ స్కంద షష్టిగా జరుపుకుంటాము ఈ పవిత్ర దినాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్త శ్వేతలతో ఆరాధిస్తే ఆయన అనుగ్రహం కలిగి సమస్యలన్నీ తొలగిపోతాయి. జ్యేష్ఠ అధిక మాసంలో స్కంద షష్టి ఎప్పుడు వచ్చింది? తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం తో పాటుగా పూర్తి వివరాలు తెలుసుకోండి.

Published on: May 20, 2026, 09:30:53 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ ధర్మంలో పవిత్రమైన వ్రతం స్కంద షష్టి. ఈ వ్రతం పరమశివుడు, పార్వతీదేవి పెద్దకొడుకు, దేవసేనాధిపతి అయినటువంటి కార్తికేయ స్వామికి అంకితం చేయబడింది. ప్రతి నెలలో కూడా శుక్లపక్ష షష్టి నాడు స్కంద షష్టి జరుపుకుంటాము. భక్తిశ్రద్ధలతో ఈ ఉపవాసం ఉన్నట్లయితే కార్తికేయుని అనుగ్రహం కలిగి కష్టాల నుంచి బయటపడవచ్చు. ధైర్యం, విజయాలు లభిస్తాయని కూడా విశ్వాసం. అధిక జ్యేష్ఠ మాసంలో స్కంద షష్టి ఎప్పుడు వచ్చింది? తేదీ, శుభ ముహూర్తంతో పాటు వ్రత విధానం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

స్కంద షష్ఠి ఎప్పుడు? మే 21న, 22న? తేదీ, శుభ ముహూర్తం, ప్రాముఖ్యత పూజా విధానంతో చదువుకోవాల్సిన మంత్రాలు (pinterest)
స్కంద షష్ఠి ఎప్పుడు? మే 21న, 22న? తేదీ, శుభ ముహూర్తం, ప్రాముఖ్యత పూజా విధానంతో చదువుకోవాల్సిన మంత్రాలు (pinterest)

మే 2026 తేదీ, శుభ ముహూర్తం:

పంచాంగం ప్రకారం చూసినట్లయితే, అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్ష షష్టి తిథి మే 21, అనగా రేపు ఉదయం 8:27కి ప్రారంభమవుతుంది. మే 22 ఉదయం 6:25తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం చూసినట్లయితే, స్కంద షష్టి వ్రతాన్ని మే 21, అనగా రేపు ఆచరించాలి.

పూజా విధానం:

  1. వ్రతం ఆచరించాలనుకునేవారు తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు కట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది.
  2. పూజ గదిలో శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టి పూజించాలి. ఉపవాస సంకల్పం చేసుకోవాలి.
  3. సుబ్రహ్మణ్యస్వామికి కుంకుమ, గంధం, అక్షింతలు, పసుపు, పువ్వులు, పండ్లు, ధూపం, దీపం సమర్పించండి. చివరగా పండ్లు లేదా స్వీట్లు నైవేద్యంగా సమర్పించండి.

ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచిది:

“ఓం శరవణ భవాయ నమః”

ఈ మంత్రాన్ని జపించడం వలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు స్కంద షష్టి కవచం పారాయణం చేస్తే ఎంతో శుభ ఫలితం కలుగుతుంది. ప్రతికూల శక్తి ఏమైనా ఉంటే కూడా తొలగిపోతుంది. కర్పూరం లేదా దీపంతో హారతి ఇచ్చి స్వామి అనుగ్రహాన్ని పొందండి.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత:

పురాణాల ప్రకారం చూసినట్లయితే, ఈ పవిత్ర దినాన కార్తికేయుడు తారకాసురుడు, సూరపద్ముడు అనే రాక్షసులను సంహరించి వారి పీడ నుంచి దేవతలను విముక్తి చేశాడు. అందుకే ఆయనను యుద్ధ దేవుడు అని కూడా అంటారు. ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారి పిల్లలకు దీర్ఘాయుష్షు కలుగుతుందని విశ్వాసం. కార్తికేయ స్వామి కుజగ్రహాధిపతి కనుక కార్తికేయుడ్ని ఆరాధించడం వలన జాతకంలో కుజదోషాలు కూడా తొలగిపోతాయి.

ఈ సుబ్రహ్మణ్య శ్లోకాలు కూడా చదువుకోండి

ఈ శ్లోకాలను చదువుకుంటే ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కుజదోష ప్రభావం నుంచి కూడా బయటపడచ్చు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, ఆయుష్షు పెరుగుతుంది. అడ్డంకులు తొలగిపోయి విజయాలు కలుగుతాయి. ప్రతికూల శక్తి దూరమై సానుకూల శక్తి వ్యాపిస్తుంది.

ఓం తత్పురుషాయ విద్మహే

మహాసేనాయ ధీమహి

తన్నో షణ్ముఖః ప్రచోదయాత్..

షడాననం కుంకుమ రక్తవర్ణం

మహామతిం దివ్య మయూరవాహనం

రుద్రస్య సూనుం సురసైన్యనాథం

గుహం సదాహం శరణం ప్రపద్యే..

మంగళం శక్తి హస్తాయ

మంగళం మయూరవాహనాయ

మంగళం స్కందరూపాయ

సుబ్రహ్మణ్యాయ మంగళమ్..

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More