చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తగ్గుతుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉండే నేమ్ ప్లేట్ విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఇంటిని గుర్తించడానికి కాదు, ఇంటి అందాన్ని కూడా నేమ్ ప్లేట్ పెంచుతుంది. అలాగే వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వస్తుంది. వాస్తు ప్రకారం నేమ్ ప్లేట్ ఎక్కడ ఏర్పాటు చేయాలి, దాని పరిమాణం, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాన ద్వారం దగ్గర ఉండే నేమ్ ప్లేట్ ఏ దిశలో ఉంటే మంచిది?

వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం కుడివైపున నేమ్ ప్లేట్ పెట్టడం మంచిది. దీనిని శుభప్రదంగా భావిస్తారు. సులువుగా కనిపించే ప్రదేశంలో నేమ్ ప్లేట్ పెట్టడం మంచిది. నేమ్ ప్లేట్ మరీ కిందకు లేదా నేలకు దగ్గరగా ఉండకూడదు. కంటి స్థాయికి దగ్గరగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి.
పరిమాణం ఎలా ఉంటే మంచిది?
నేమ్ ప్లేట్ కోసం దీర్ఘచతురస్రాకారం లేదా చతురస్రాకారంగా ఉండే వాటిని ఎంపిక చేసుకోండి. వాస్తు ప్రకారం చాలా అసమానంగా, వంకరగా లేదా క్లిష్టమైన డిజైన్లతో ఉండే నేమ్ ప్లేట్స్‌ని పెట్టడం మంచిది కాదు. సరళంగా, శుభ్రంగా ఉండే డిజైన్స్‌ని ఎంపిక చేసుకోండి.
ఏ దిశలో నేమ్ ప్లేట్ ఉండాలి?
తూర్పు దిశ: తూర్పు వైపు ఉన్నవాళ్లకు చెక్కతో తయారు చేసిన ప్లేట్ మంచిది. ఇది శుభ ఫలితాలను అందిస్తుంది.
ఉత్తర దిశ: ఉత్తరం వైపు ఇల్లు ఉన్నట్లయితే, అలాంటి ఇళ్లకు మెటల్ నేమ్ ప్లేట్ అనుకూలంగా ఉంటుంది.
దక్షిణ దిశ: దక్షిణ దిశలో ప్రవేశ ద్వారం ఉన్నట్లయితే, నేమ్ ప్లేట్‌ని ఎంచుకునేటప్పుడు ఇంటి మొత్తం వాస్తుని పరిగణలోకి తీసుకుని నేమ్ ప్లేట్‌ని ఎంచుకోండి.
నేమ్ ప్లేట్ ఏ రంగులో ఉంటే మంచిది?
లైట్ కలర్స్‌ని ప్రిఫర్ చేయండి. తెలుపు, లైట్ పసుపు, గ్రీన్ వంటివి అనుకూలమైన ఫలితాలను అందిస్తాయి. ముదురు రంగులను ఉపయోగించొద్దు.
నేమ్ ప్లేట్ విషయంలో ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి
{{/usCountry}}లైట్ కలర్స్‌ని ప్రిఫర్ చేయండి. తెలుపు, లైట్ పసుపు, గ్రీన్ వంటివి అనుకూలమైన ఫలితాలను అందిస్తాయి. ముదురు రంగులను ఉపయోగించొద్దు.
నేమ్ ప్లేట్ విషయంలో ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి
{{/usCountry}}నేమ్ ప్లేట్ స్పష్టంగా, ప్రత్యేకంగా కనిపించేలా తయారు చేయించండి. పగిలిపోయిన, విరిగిన లేదా తుప్పుపట్టిన నేమ్ ప్లేట్స్ ని మాత్రం తొలగించాలి.
నేమ్ ప్లేట్ పైన ఉన్న పేరు సులభంగా చదివే విధంగా ఉండాలని గుర్తు పెట్టుకోండి.
అలాగే ప్రధాన ద్వారం వద్ద తగినంత లైటింగ్ ఉండాలి.