...
...
Next Story

కంచం లేదా విస్తరిలో ముందు ఎందుకు అన్నం వడ్డించుకోకూడదు, దానికి కారణం ఏంటి?

మన పూర్వికులు పాటిస్తున్న పద్ధతులను ఇంకా పాటిస్తున్నాము. చాలా మంది కొన్ని పొరపాట్లు తెలియక చేస్తూ ఉంటారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం చూసినట్లయితే భోజనం అనేది ఒక యజ్ఞం వంటిది. పెద్దలు కూడా ఈ విషయాన్ని చెప్పే ఉంటారు. పెద్దలు విస్తరిలో ముందుగా అన్నం వడ్డించకూడదని చెప్పడానికి గల కారణాలు ఏంటి?

Published on: Jan 29, 2026 10:00 AM IST
Advertisement

భోజనం తినేటప్పుడు కొన్ని నియమాలని చాలా మంది పాటిస్తూ ఉంటారు. అలాగే భోజనాన్ని వడ్డించుకునేటప్పుడు కూడా చాలా మంది పెద్దలు ముందు అన్నం పెట్టకూడదని చెప్పడం మీరు వినే ఉంటారు. నిజానికి భోజనం వడ్డించేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదు. ముఖ్యంగా అన్నాన్ని కంచం లేదా విస్తరిలో ముందు వడ్డించడం మంచిది కాదు. దాని వెనుక కారణమేంటి? ఎందుకు అన్నాన్ని ముందు పెట్టకూడదని పెద్దలు చెప్తారు? అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎందుకు కంచం లేదా విస్తరిలో ముందు అన్నం వడ్డించుకోకూడదు?

కంచం లేదా విస్తరిలో ముందు ఎందుకు అన్నం వడ్డించుకోకూడదు (pinterest)
కంచం లేదా విస్తరిలో ముందు ఎందుకు అన్నం వడ్డించుకోకూడదు (pinterest)

మన పూర్వికులు పాటిస్తున్న పద్ధతులను ఇంకా పాటిస్తున్నాము. చాలా మంది కొన్ని పొరపాట్లు తెలియక చేస్తూ ఉంటారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం చూసినట్లయితే భోజనం అనేది ఒక యజ్ఞం వంటిది. పెద్దలు కూడా ఈ విషయాన్ని చెప్పే ఉంటారు. పెద్దలు విస్తరిలో ముందుగా అన్నం వడ్డించకూడదని చెప్పడానికి గల కారణాలు ఏంటి అనే దానిని ఇప్పుడు తెలుసుకుందాం.

ఎందుకు మొదట అన్నాన్ని వడ్డించకూడదు?

అశుభ సంకేతం

శ్రాద్ధ కర్మలు అంటే పితృ కార్యాలు చేసేటప్పుడు మాత్రమే మొదట విస్తరిలో అన్నం వడ్డిస్తారు. కాబట్టి శుభకార్యాలు, నిత్యజీవితంలో మొదట అన్నాన్ని వడ్డించకూడదని అంటారు. ఇలా చేయడం అరిష్టంగా భావిస్తారు. అందుకే పెద్దలు కూడా మొదట కంచంలో లేదా విస్తరిలో అన్నాన్ని వడ్డించకూడదని, మిగిలిన పదార్థాలను వడ్డించిన తర్వాత మాత్రమే అన్నం పెట్టమని చెప్తూ ఉంటారు.

సాంప్రదాయ పద్ధతి

శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, మొదట కంచం లేదా విస్తరిలో వడ్డించేటప్పుడు నెయ్యి, ఉప్పు, పచ్చడి, కూరలు ఇవన్నీ వడ్డించాలి. ఆ తర్వాత మాత్రమే అన్నాన్ని వడ్డించాలి. ఇలా చేయడం వలన అన్నపూర్ణాదేవికి గౌరవం ఇచ్చినట్లు అవుతుంది.

అమర్యాద

కేవలం పితృ కార్యాలు చేసేటప్పుడు మాత్రమే అన్నాన్ని మొదట వడ్డించి, ఆ తర్వాత మిగిలిన పదార్థాలను వడ్డించాలి. మిగిలిన సందర్భాల్లో, రోజూ భోజనం చేసేటప్పుడు మొదట అన్నం పెట్టకూడదు. అన్నం కాకుండా మిగిలిన పదార్థాలు ముందుగా వడ్డించుకుని, చివరగా అన్నం వడ్డించుకోవాలి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe