పితృ పక్షంలో నల్ల నువ్వులకు ఎందుకంత ప్రాధాన్యత? కారణం ఇదే!

హిందూ సంప్రదాయంలో పితృ పక్షం పూర్వీకులను స్మరించుకుని శ్రాద్ధం, తర్పణం, పిండదానం వంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించే పవిత్రమైన కాలంగా భావిస్తారు. ఈ కర్మల్లో నల్ల నువ్వులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని కథనం వివరిస్తోంది. 

Published on: Oct 2, 2026, 08:00:44 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హిందూ సంప్రదాయంలో పితృ పక్ష సమయాల్లో తర్పణాలు, శ్రాద్ధ కర్మల్లో నల్ల నువ్వులకు ప్రత్యేక స్థానం ఉంది. పూర్వీకుల అనుగ్రహం పొందడంతో పాటు గ్రహ దోషాల నివారణకు ఈ నల్ల నువ్వులు ఏ విధంగా తోడ్పడతాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

పితృ పక్షంలో నల్ల నువ్వులకు ఎందుకంత ప్రాధాన్యత? కారణం ఇదే!
పితృ పక్షంలో నల్ల నువ్వులకు ఎందుకంత ప్రాధాన్యత? కారణం ఇదే!

హిందూ సనాతన ధర్మంలో పూర్వీకులను స్మరించుకునే అత్యంత పవిత్రమైన కాలం పితృ పక్షం. ఈ ప్రత్యేక దినాలలో మనల్ని కనిపెంచి పెంచిన పెద్దలను, పూర్వీకులను భక్తి శ్రద్ధలతో తలుచుకుంటూ వారి నిమిత్తం శ్రాద్ధాలు, తర్పణాలు, పిండ దానం వంటి ధార్మిక కార్యక్రమాలను నిర్వర్తిస్తారు.

ఈ ఆచారాలన్నింటిలోనూ అనేక రకాల పూజా సాగ్రిలను ఉపయోగించినప్పటికీ, నల్ల నువ్వులకు మాత్రం అత్యున్నతమైన స్థానం ఉంది. పితృ దేవతలకు జలంతో పాటు నల్ల నువ్వులను కలిపి తర్పణం విడిచి పెట్టడం మన దేశంలో యుగాలుగా వస్తున్న ఆచారం. అసలు ఈ నల్ల నువ్వులకు పితృ కర్మల్లో అంతటి ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న పౌరాణిక, జ్యోతిష్య నేపథ్యం ఏమిటో ఇప్పుడు పరిశీలిద్దాం.

భగవంతుని చెమట నుంచి ఉద్భవించిన నల్ల నువ్వులు

మన ధార్మిక గ్రంథాల ప్రకారం, నువ్వుల పుట్టుక నేరుగా జగత్ రక్షకుడైన శ్రీ మహావిష్ణువుతో ముడిపడి ఉంది. పురాణ గాథల ప్రకారం, నల్ల నువ్వులు శ్రీమన్నారాయణుడి చెమట బిందువుల నుంచి ఉద్భవించాయని విశ్వసిస్తారు. అందుకే వీటిని ఎంతో పవిత్రమైనవిగా పరిగణించి, అన్ని రకాల ధార్మిక, పవిత్ర కార్యాల్లో విధిగా ఉపయోగిస్తారు. పితృ పక్షంలో తర్పణం ఇచ్చే సమయంలో నీటిలో నల్ల నువ్వులను కలిపి విడిచిపెట్టడం వెనుక ఈ బలమైన నమ్మకం ఉంది. ఇలా చేయడం వల్ల పూర్వీకులు పరిపూర్ణంగా తృప్తి చెందడమే కాకుండా, స్వయంగా శ్రీహరి అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తుల గాఢమైన విశ్వాసం.

నల్ల నువ్వుల విశిష్టత

పూర్వీకుల నిమిత్తం నిర్వహించే పవిత్ర కార్యాల్లో ఎలాంటి అడ్డంకులు, దుష్ట శక్తుల ప్రభావం తగలకుండా అడ్డుకోవడంలో నల్ల నువ్వులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శ్రాద్ధ కర్మలు ఎలాంటి విఘ్నాలు లేకుండా ప్రశాంతంగా ముగిసేందుకు ఇవి తోడ్పడతాయి. తర్పణ సమయంలో నీటితో పాటు నల్ల నువ్వులను చేర్చి సమర్పించడం ద్వారా పూర్వీకుల పట్ల మనకు ఉన్న అచంచలమైన భక్తి, శ్రద్ధను చాటిచెప్పినవారమవుతాం.

జ్యోతిష్య శాస్త్రంలో శని, రాహు-కేతువుల ప్రభావం

కేవలం ఆధ్యాత్మిక కోణమే కాకుండా, జ్యోతిష్య శాస్త్ర పరంగా కూడా నల్ల నువ్వులకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం, నల్ల నువ్వులు గ్రహాల రాకుమారుడైన శనితో పాటు ఛాయా గ్రహాలైన రాహు-కేతువులకు కూడా ప్రతీకగా భావిస్తారు. జాతకంలో ఈ గ్రహాల వల్ల కలుగుతున్న అశుభ ఫలితాలు, పీడలను తగ్గించుకోవడానికి నిపుణులు నల్ల నువ్వుల దానాన్ని సిఫారసు చేస్తుంటారు. పితృ పక్షంలో నువ్వులను ఉపయోగించడం ద్వారా పితృ దోషాలతో పాటు గ్రహ దోషాల తీవ్రత కూడా కొంత వరకు తగ్గిపోతుందని నమ్ముతారు.

తర్పణంలో నల్ల నువ్వులను ఎలా ఉపయోగించాలి?

పితృ కర్మల సమయంలో కేవలం నీటిని వదలడం మాత్రమే కాకుండా, ఆ జలంలో గుప్పెడు నల్ల నువ్వులను కలుపుతారు. అంతేకాకుండా, పితృ దేవతల పేరిట నిర్వహించే ప్రత్యేక హోమాల్లోనూ నల్ల నువ్వులతో పూర్ణాహుతి ఇస్తుంటారు. అంతేకాకుండా, పూర్వీకుల పేరున నల్ల నువ్వులతో తయారు చేసిన పిండి వంటలు లేదా పదార్థాలను నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం కూడా మన సంస్కృతిలో ఉంది. ఈ చిన్న ఆచారాలన్నింటి ఆచరణ ద్వారా కుటుంబంలో సుఖశాంతులు, సిరి సంపదలు వెల్లివిరుస్తాయని పెద్దలు చెబుతుంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More