...
...
Next Story

Yogini and Devshayani Ekadashi: జూలై నెలలో వస్తున్న యోగినీ, దేవశయని ఏకాదశి తిథులు, విశిష్టతలివే!

జూలై ఏకాదశి జాబితా 2026: ప్రతి నెలా కృష్ణ మరియు శుక్ల పక్షం ఏకాదశి రోజున ఏకాదశి ఉపవాసం జరుపుకుంటారు. హిందూ మతంలో ఏకాదశి ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఉపవాసం యొక్క పుణ్య ప్రభావం పాపాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆశించిన ఫలితాన్ని పొందుతుందని నమ్ముతారు.

Published on: Jul 1, 2026, 11:00:42 IST
Advertisement

హిందూ పంచాంగం ప్రకారం ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తాయి. కృష్ణ పక్షం మరియు శుక్ల పక్షాల్లో వచ్చే ఈ తిథులు విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఈ రోజుల్లో భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి, పూజలు చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి, కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం. 2026 జూలై నెలలో రాబోయే రెండు ప్రధాన ఏకాదశుల వివరాలు చూద్దాం.

యోగినీ ఏకాదశి: జూలై 10

Yogini and Devshayani Ekadashi: జూలై నెలలో వస్తున్న యోగినీ, దేవశయని ఏకాదశి తిథులు, విశిష్టతలివే!
Yogini and Devshayani Ekadashi: జూలై నెలలో వస్తున్న యోగినీ, దేవశయని ఏకాదశి తిథులు, విశిష్టతలివే!

ఆషాఢ మాస కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని 'యోగినీ ఏకాదశి'గా పిలుస్తారు. జూలై 10న తెల్లవారుజామున 04:46 గంటలకు ప్రారంభమై, జూలై 11వ తేదీ రాత్రి 01:52 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం జూలై 10, శుక్రవారం రోజున భక్తులు యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు.

వ్రత పారణ సమయం:

వ్రతాన్ని ముగించేందుకు (పారణ) జూలై 11 ఉదయం 07:02 గంటల నుండి 09:10 గంటల మధ్య సమయం అత్యంత శుభప్రదంగా నిర్ణయించారు.

యోగినీ ఏకాదశి ఫలితాలు:

పురాణాల ప్రకారం, ఈ ఏకాదశిని ఆచరిస్తే 88 వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యం దక్కుతుంది. శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, గత జన్మల పాపాలు కూడా నశిస్తాయని శాస్త్రం చెబుతోంది. సాధకులకు మోక్షప్రాప్తి కలుగుతుంది.

దేవశయని ఏకాదశి: జూలై 25

ఆషాఢ శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని 'దేవశయని ఏకాదశి' అంటారు. ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు. జూలై 24 ఉదయం 05:42 గంటలకు మొదలై, జూలై 25 ఉదయం 08:04 గంటల వరకు తిథి ఉంటుంది. ఉదయ తిథి ప్రామాణికంగా జూలై 25, శనివారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి.

వ్రత పారణ సమయం:

దీనిని 'హరి శయని' అని కూడా అంటారు. ఈ రోజు నుండే చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. ఈ వ్రతం చేయడం వల్ల మూడు లోకాలలోని పుణ్యతీర్థాలను సేవించినంత ఫలితం దక్కుతుంది. అకాల మృత్యు భయం తొలగిపోయి, విష్ణు అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయి.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks