Yuti Yogam: యుతి యోగం.. ఈ 3 రాశుల వారికి కనకవర్షం.. శుక్ర, గురువుల కరుణతో అదృష్టం మీ వెంటే!

Yuti Yogam: గ్రహ సంచారంలో మరో అద్భుతం జరగబోతోంది. 2026 జూన్ 10న శుక్రుడు, గురు గ్రహాల కలయికతో 'యుతి యోగం' ఏర్పడనుంది. ఈ శక్తివంతమైన యోగం కారణంగా కర్కాటక, తులా, కుంభ రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా రాజయోగం పట్టబోతోంది. ఆ వివరాలు మీకోసం.

Published on: Apr 30, 2026, 16:20:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Yuti Yogam: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగితే అది అందరిపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి శుభ ఫలితాలు ఏర్పడితే, మరోసారి అశుభ ఫలితాలు కూడా కలుగుతాయి. జ్యోతిష్య లెక్కల ప్రకారం 2026 జూన్‌లో యుతి యోగం ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశుల వారి జీవితంలో విపరీతమైన అదృష్టాన్ని తీసుకురాబోతోంది.

Yuti Yogam june 2026 venus jupiter conjunction these 3 rasis receives lots of luck wealth (pinterest)
Yuti Yogam june 2026 venus jupiter conjunction these 3 rasis receives lots of luck wealth (pinterest)

జ్యోతిష్య లెక్కల ప్రకారం జూన్ 10న కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. సానుకూల మార్పులు కూడా కనిపిస్తాయి. ఈ యుతి యోగం శుక్రుడు, గురువు సంయోగం వల్ల ఏర్పడుతోంది. ఈ రెండు గ్రహాల వలన కలిగే ఈ యోగం మంచి ఫలితాలను తీసుకురాబోతోంది. కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టం కూడా కలగబోతోంది. మరి ఆ రాశుల వారు ఎవరో, వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

యుతి యోగంతో ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు, అదృష్టం కూడా రెట్టింపు:

1.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి ఈ యోగం వలన ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. ప్రశాంతతను పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అనేక విధాలుగా అవకాశాలు కలిసి వస్తాయి.

ఈ సమయంలో ఈ రాశి వారికి కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. రిలేషన్‌షిప్ బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది.

2.తులా రాశి:

తులా రాశి వారికి కూడా ఇది శుభ సమయం. యుతి యోగంతో ఈ రాశి వారు కూడా అనేక విధాలుగా లాభాలు పొందుతారు. సంతోషం కూడా పెరుగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.

పాత స్నేహితులతో సమయాన్ని సంతోషంగా గడుపుతారు. పాత జ్ఞాపకాలను తలుచుకుంటారు. ఆర్థిక పరంగా కూడా ఇది శుభ సమయం. తెలివిగా మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఆనందం కూడా పెరుగుతుంది.

3.కుంభ రాశి:

కుంభ రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. అనవసరంగా భవిష్యత్తు గురించి దిగులు పడకండి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా ఉంటారు.

బిజీ షెడ్యూల్ నుంచి కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. రిలేషన్‌షిప్ బాగుంటుంది. మీ ఆలోచనల్లో కూడా సానుకూల మార్పులు వస్తాయి. మీరు ఇష్టమైన వారికి స్పెషల్ లేదా ఖరీదైన బహుమతిని కొనుగోలు చేస్తారు. ఇంట్లో వాతావరణం సానుకూలంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఆనందం కూడా పెరుగుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More