రంగారెడ్డి జిల్లా కోకాపేటలో భూముల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి కోకాపేట భూమి రికార్డు సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భూముల ఈ వేలంలో ప్లాట్లు ఊహించని ధరలు పలికాయి. ప్రభుత్వం నిర్వహించిన ఈ వేలంలో ఎకరం రూ.137 కోట్లు పలికింది.

నియోపొలీస్ లేఅవుట్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) నిర్వహించిన వేలంలో ఎకరం భూమికి రికార్డు స్థాయిలో రూ.137.25 కోట్ల ధర పలికింది. మెుత్తం 9.90 ఎకరాల ప్లాట్‌ను రూ.1355.33 కోట్లకు కొనుగోలు చేశారు.
అధికారులు ఈ లేఅవుట్‌ను అంతర్జాతీయ సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. వేలంలో చూసుకుంటే మెుదటి రౌండ్‌లో రెండు ప్లాట్లు అమ్ముడుపోయాయి. ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలకు గానూ ఎకరానికి రూ.136.50 కోట్లకు, ప్లాట్ నెంబర్ 18లో ఎకరానికి రూ.137.25 కోట్ల చొప్పున 5.31 ఎకరాలు అమ్ముడుపోయాయి. హెచ్ఎండీఏ మెుదటి బిడ్ కనీస ధర రూ.99గా నిర్ధారించి డైరెక్ట్ బిడ్డింగ్ నిర్వహించింది. ఈ లేఅవుట్ 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీని అభివృద్ధి కోసం దాదాపు రూ.300 కోట్లను ఖర్చు చేశారు.
అయితే కోకాపేట భూములకు ఇప్పుడే కాదు.. గతంలోనే రెక్కలు వచ్చాయి. ఎవరూ ఊహించిని విధంగా ఒక్కసారిగా ధరలు భారీగా పెరిగాయి. 2023లో కోకాపేటలో ఎకరం భూమి రూ.100.75 కోట్లకు అమ్ముడైంది. ఇప్పుడు చూస్తే అంతకుమించి ధర పలికింది.
హెచ్‌డీంఏ మెుత్తం వేలం నుంచి రూ.5000 కోట్లకు పైగా ఆదాయం రావాలని ఆశిస్తుంది. కోకాపేట నియోపోలీస్ ప్లాట్‌లకు రూ.99 కోట్లు, గోల్డెన్ మైల్‌కు రూ.70 కోట్లు, మూసాపేట ప్లాట్‌లకు రూ.75 కోట్లు కనీస ధరలను నిర్ధారించిన విషయం తెలిసిందే. మిగిలిన ప్లాట్లకు వేలం నవంబర్ 28, డిసెంబర్ 3, 5 తేదీల్లో జరగనున్నాయి. ఈ వేలాలు కూడా రికార్డు ధరలు వస్తాయని అధికారులు అనుకుంటున్నారు.
మెున్నటికి మెున్న రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోనూ టీఎస్ఐఐసీ నిర్వహించిన ఈ వేలంలో 18.67 ఎకరాల ప్రభుత్వ భూములు రూ.3135 కోట్లకు అమ్ముడైన విషయం తెలిసిందే. ఇక్కడ ఎకరానికి రూ.177 కోట్ల ధర పలికింది. అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ధర అత్యధికం. ఈ భూమి ఐటీ కంపెనీల మధ్య ఉండటంతో పోటీ ఎక్కువ ఉంది. ఇక ఇప్పుడు మళ్లీ కోకాపేటలోనూ రికార్డు స్థాయిలో భూములకు ధరలు పలికాయి.
{{/usCountry}}మెున్నటికి మెున్న రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోనూ టీఎస్ఐఐసీ నిర్వహించిన ఈ వేలంలో 18.67 ఎకరాల ప్రభుత్వ భూములు రూ.3135 కోట్లకు అమ్ముడైన విషయం తెలిసిందే. ఇక్కడ ఎకరానికి రూ.177 కోట్ల ధర పలికింది. అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ధర అత్యధికం. ఈ భూమి ఐటీ కంపెనీల మధ్య ఉండటంతో పోటీ ఎక్కువ ఉంది. ఇక ఇప్పుడు మళ్లీ కోకాపేటలోనూ రికార్డు స్థాయిలో భూములకు ధరలు పలికాయి.
{{/usCountry}}