హైదరాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిబావి, ఇందిరా నగర్ కాలనీలో ఈ నెల 7వ తేదీ రాత్రి జరిగిన బీటెక్ విద్యార్థి బొమ్మన యావన్ అలియాస్ అఖిల్ (21) హత్య కేసును పోలీసులు ఛేదించారు. పక్కా పథకం ప్రకారం, ఈ ఘాతుకానికి ఒడిగట్టిన 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మృతుడు యావన్ ఒక యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడనే విషయాన్ని సదరు యువతి కుటుంబ సభ్యులు, బంధువులు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో మే 7వ తేదీ రాత్రి సుమారు 9:45 గంటల ప్రాంతంలో, నిందితులు మారణాయుధాలతో యావన్‌పై మెడ, ఇతర కీలక శరీర భాగాలపై విచక్షణారహితంగా దాడి చేశారు. యావన్ మరణించాడని నిర్ధారించుకున్నాక అక్కడి నుండి పరారయ్యారు.
మృతుడి తండ్రి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు Cr. No.231/2026 U/s. 103(1), 189(1)(4), 191(3) r/w 3(5) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో 10 మందిని అరెస్ట్ చేశారు.
నిందితుల వివరాలు
A1: అల్లబోయిన సాయి కిరణ్ అలియాస్ సాయి (27) – ప్రైవేట్ ఉద్యోగి (చిలకలగూడ పోలీస్ స్టేషన్ రౌడీ షీటర్).
A2: రాజం పరమేష్ కుమార్ యాదవ్ అలియాస్ డాన్ (19).
A3: రాజం వంశీ కృష్ణ అలియాస్ రాఖీ (19) – ప్రధాన నిందితుడు.
A4: రాజం మనీష్ అలియాస్ బిచ్చు (21).
A5: శ్రీగిరి రాహుల్ (22).
{{/usCountry}}A5: శ్రీగిరి రాహుల్ (22).
{{/usCountry}}A6: కుచుల శివ నందన్ యాదవ్ (20).
A7: రాజం నరసింహ యాదవ్ (50).
A8: రాజం శ్రీశైలం యాదవ్ (48).
A9: రాజం మల్లేష్ యాదవ్ అలియాస్ మల్లన్న (48).
CCL-1: మైనర్ బాలుడు (కోర్టులో హాజరుపరిచారు).
మృతుడు యావన్, చంద్రిక చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. చంద్రికను వివాహం చేసుకోవాలని భావించిన నిందితుడు A1 (సాయి కిరణ్), యావన్‌పై తీవ్ర ద్వేషాన్ని పెంచుకున్నాడు. హత్యకు 4-5 రోజుల ముందే మేడిబావిలో సమావేశమై యావన్‌ను అంతమొందించేందుకు నిందితులు కుట్ర పన్నారు.
హత్య తర్వాత పోలీసులు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన పదునైన కత్తి, నిందితుల రక్తపు మరకలు ఉన్న దుస్తులు, నేరానికి వాడిన ఎలక్ట్రిక్ స్కూటర్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు: ప్రతీకార దాడులకు పాల్పడటం, ఆస్తులను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడితే తీవ్ర చట్టపరమైన పర్యవసానాలు ఉంటాయి.
డిజిటల్ నిఘా: సోషల్ మీడియా వేదికలపై రెచ్చగొట్టే సందేశాలు పంపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
శాస్త్రీయ దర్యాప్తు: ఈ కేసును అత్యంత పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేస్తున్నాం. నిందితులకు కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చూస్తాం.
'పౌరుల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడం. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని వేగంగా అరెస్ట్ చేశాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతాం.' అని సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపారు.