Bathroom Videos: లేడీ డాక్టర్లు స్నానం చేస్తుండగా వీడియో.. శ్రీలంక క్రికెటర్ల దారుణం.. అరెస్ట్ చేసిన పోలీసులు

Bathroom Videos: శ్రీలంక క్రికెట్‌లో క్రమశిక్షణారాహిత్యం మరోసారి చర్చనీయాంశమైంది. ఒక ప్రైవేట్ హోటల్‌లో స్నానం చేస్తున్న లేడీ డాక్టర్లను రహస్యంగా వీడియో తీసిన ఇద్దరు అండర్-19 క్రికెటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనూ పలువురు సీనియర్ ప్లేయర్లు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం గమనార్హం.

Published on: May 1, 2026, 09:39:40 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bathroom Videos: శ్రీలంక క్రికెట్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. మైదానంలో ఆట కంటే ఆటగాళ్ల ప్రవర్తన వల్లే శ్రీలంక బోర్డు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా లంక అండర్-19 జాతీయ జట్టుకు చెందిన ఇద్దరు సభ్యులు అత్యంత జుగుప్సాకరమైన రీతిలో ప్రవర్తించి కటకటాల పాలయ్యారు.

Bathroom Videos: లేడీ డాక్టర్లు స్నానం చేస్తుండగా వీడియో.. శ్రీలంక క్రికెటర్ల దారుణం.. అరెస్ట్ చేసిన పోలీసులు (AFP)
Bathroom Videos: లేడీ డాక్టర్లు స్నానం చేస్తుండగా వీడియో.. శ్రీలంక క్రికెటర్ల దారుణం.. అరెస్ట్ చేసిన పోలీసులు (AFP)

అసలు ఏం జరిగిందంటే?

నారహేన్‌పిటలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో కొంతమంది మహిళా వైద్యులు వృత్తిపరమైన కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు బస చేశారు. అదే సమయంలో అక్కడ ఉంటున్న ఇద్దరు శ్రీలంక అండర్-19 క్రికెటర్లు.. లేడీ డాక్టర్లు స్నానం చేస్తుండగా బాత్‌రూమ్ కిటికీల గుండా తమ మొబైల్ ఫోన్లతో రహస్యంగా వీడియోలు తీశారు. దీనిని గమనించిన బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

షాకింగ్ నిజాలు

పోలీసుల ప్రాథమిక విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ ప్లేయర్లు కేవలం మహిళా వైద్యులనే కాకుండా, అక్కడి పురుషుల వీడియోలను కూడా చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకుని, ఆ వీడియోలను ఎవరికైనా షేర్ చేశారా లేదా ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ప్లేయర్లను కోర్టులో హాజరుపరచగా, వారికి వ్యక్తిగత పూచీకత్తుపై (సుమారు 1564 డాలర్లు) బెయిల్ లభించింది. ఈ కేసు తదుపరి విచారణ మే 25న జరగనుంది.

శ్రీలంక క్రికెటర్ల 'కళంకిత' చరిత్ర

శ్రీలంక క్రికెటర్లు ఇలాంటి లైంగిక వేధింపుల కేసుల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలువురు ప్రముఖులు ఇబ్బందుల్లో పడ్డారు.

ధనుష్క గుణతిలక: 2022 టీ20 వరల్డ్ కప్ సమయంలో ఆస్ట్రేలియాలో అత్యాచార ఆరోపణలపై అరెస్టయ్యాడు.. తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు.

దులిప్ సమరవీర: ఒక మహిళా ప్లేయర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇతడిపై 20 ఏళ్ల నిషేధం విధించింది.

తిలకరత్న దిల్షాన్: 2010లో జింబాబ్వే పర్యటనలో ఉన్నప్పుడు ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి.

శ్రీలంక క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లను కేవలం క్రికెటర్లుగానే కాకుండా, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో విఫలమవుతోందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అండర్-19 స్థాయిలోనే ఇలాంటి ప్రవృత్తి ఉందంటే, అది లంక క్రికెట్ భవిష్యత్తుకే ప్రమాదకరమని చెప్పవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. శ్రీలంక అండర్-19 క్రికెటర్లపై ఉన్న ఆరోపణలేంటి?

ఒక ప్రైవేట్ హోటల్‌లో స్నానం చేస్తున్న మహిళా వైద్యులను తమ మొబైల్ ఫోన్లతో రహస్యంగా వీడియో తీసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి.

2. గతంలో ఏ శ్రీలంక క్రికెటర్లు ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నారు?

ధనుష్క గుణతిలక, దులిప్ సమరవీర, తిలకరత్న దిల్షాన్ వంటి ప్రముఖ ఆటగాళ్లు గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More