...
...
Next Story

భూపాలపల్లి జిల్లా అడవుల్లోని వాగులో బయటపడ్డ విష్ణుమూర్తి విగ్రహం.. వీడియో చూస్తే గూస్‌బంప్స్

ancient Lord Vishnu idol : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పురాతన విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. ఈ విగ్రహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Published on: Mar 3, 2026, 22:31:25 IST
Advertisement

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారం మండలం చింతకాని గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఒక వాగులో విష్ణువు విగ్రహం బయటపడింది. నిజానికి ఈ విగ్రహం మూడు సంవత్సరాల కిందటే కనిపించింది. అప్పట్లో చేపలు పట్టేందుకు వెళ్లినవారు చూశారు. కొన్ని రోజులు పూజలు చేశారు. తర్వాత అలాగే వదిలేయడంతో ఇసుకలో కూరుకుపోయింది.

వాగులో బయటపడ్డ విష్ణుమూర్తి విగ్రహం
వాగులో బయటపడ్డ విష్ణుమూర్తి విగ్రహం

మళ్లీ ఈ ఏడాది తాజాగా కొన్ని రోజుల కిందట కొంతమందికి విగ్రహం తల భాగం కనిపించింది. దీంతో ఈ విషయం మరోసారి బయటకు వచ్చింది. విగ్రహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత చింతకాని, జగ్గయపల్లి గ్రామస్థులు విగ్రహాన్ని బయటకు తీశారు. అయితే విగ్రహంపై రెండు గ్రామాల ప్రజల మధ్య చర్చ నడిచింది. విగ్రహం తన చేను దగ్గరలో బయట పడిందని, ఆలయ నిర్మాణానికి స్థలం ఇస్తానని ఓ రైతు చెప్పాడు. ఈ విగ్రహ రూపాన్ని బట్టి కాకతీయుల కాలంనాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. విగ్రహం కొన్ని చోట్ల ధ్వంసమైంది. గుప్తనిధుల తవ్వకాల్లో విగ్రహం ధ్వంసమై ఉంటుందని గ్రామస్థులు పేర్కొన్నారు.

ఈ విగ్రహం 12వ శతాబ్దానికి చెందినదని, కోటకు సమీపంలో చక్కగా చెక్కబడిన విష్ణు మూర్తి శిల్పంలా కనిపిస్తుందని, చాలా సంతోషంగా ఉందని స్థానికులు అంటున్నారు. ఈ విగ్రహం కాకతీయ కాలం నాటిదని చెప్పవచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. ఇది అప్పటి హస్తకళకు నిదర్శనమన్నారు.

శిల్పం అనేక చోట్ల దెబ్బతిన్నట్లు గమనించవచ్చు. అయితే ఆగమ శాస్త్రం ప్రకారం అటువంటి విగ్రహం ఆచార పూజకు తగినది కాదని కొందరు చెబుతున్నారు. వారసత్వ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం విగ్రహాన్ని భద్రపరచాలని కోరుతున్నారు. విగ్రహం కచ్చితమైన కాలం, చారిత్రక సందర్భాన్ని నిర్ణయించడానికి పురావస్తు శాఖ అధికారులు ఇంకా వివరణాత్మక పరీక్ష నిర్వహించలేదు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe