రాష్ట్రంలో సంచలనం సృష్టించిన భూ భారతి, ధరణి రిజిస్ట్రేషన్లలోని అక్రమాల కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో వెలుగు చూసిన రూ. 3.90 కోట్ల కుంభకోణంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన మొత్తం ముఠాలోని 15 మందిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. మరో తొమ్మిది మంది ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ కేసు వివరాలను వరంగల్ నగర సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.

వరంగల్ సీపీ వెల్లడించిన వివరాల ప్రకారం…. ఈ ముఠా సభ్యుల నుంచి 63.19 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. , బ్యాంకులో ఉన్న 1 లక్ష రూపాయలు, సుమారు ఒక కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, రెండు ల్యాప్ టాప్స్, ఐదు డెస్క్ టాప్ కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లను సీజ్ చేశారు.
ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులైన పసునూరి బసవరాజు, జెల్లా పాండు యాదాద్రి-భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్లలో ఆన్లైన్ సర్వీస్ నిర్వహించేవారు. పట్టుబడిన 15 మంది నిందితుల్లో ఒకడైన గణేష్ అనే వ్యక్తి ఆన్లైన్ సెంటర్లతో పరిచయం చేసుకుంటాడు. చెల్లించాల్సిన మొత్తాన్ని ఏన్.ఆర్.ఐ ఖాతా పే చేస్తానని చెప్పి రైతుల నుంచి మొత్తం డబ్బులను మీసేవా వ్యక్తుల ద్వారా వసూలు చేయిస్తాడు. వసూలు చేసిన డబ్బు నుంచి ఆన్లైన్ సర్వీస్ వ్యక్తులతో పాటు మద్యవర్తులకు కమిషన్ చొప్పున డబ్బు అందజేస్తాడు. ఈ- చలాన్లను ప్రధాన నిందితుడుకి పంపిచేవాడు. ఇలా వచ్చిన చలాన్లను బసవరాజు…. ధరణి/భూభారతీ వెబ్సైట్లో ఇన్స్ పెక్ట్ ఎడిట్ అప్లికేషన్ ఉపయోగించి చలాన్ రుసుం తగ్గించేవాడు. ఆ తర్వాత చలాన్ ను మొబైల్ ద్వారా ఎడిట్ చేసి తిరిగి రైతులకు పంపేవాడు.
ఇదే క్రమంలో నిందితులు మొబైల్ ఆప్లికేషన్ ను ఉపయోగించి ప్రభుత్వానికి చెల్లించిన రుసుముకు సంబంధించిన రశీదులను కూడా ఎడిట్ చేస్తున్నారు. మార్పు చేసిన రుసుమును మాత్రమే ప్రభుత్వానికి చెల్లిస్తారు. నకిలీ చలాన్లను స్థానిక ఎమ్మార్వో/ రిజిస్ట్రేషన్ కార్యాలయములో మద్యవర్తుల ద్వారా సమర్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ మోసాలకు పాల్పడేవారు. ఈ విధంగా ప్రధాన నిందితులు ఇద్దరు సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డారు. ఈ వ్యవహారంలో భాగస్వాములైన వారికి పది శాతం నుంచి 30శాతం వరకు కమీషన్ చెల్లించేవారు.
{{/usCountry}}ఇదే క్రమంలో నిందితులు మొబైల్ ఆప్లికేషన్ ను ఉపయోగించి ప్రభుత్వానికి చెల్లించిన రుసుముకు సంబంధించిన రశీదులను కూడా ఎడిట్ చేస్తున్నారు. మార్పు చేసిన రుసుమును మాత్రమే ప్రభుత్వానికి చెల్లిస్తారు. నకిలీ చలాన్లను స్థానిక ఎమ్మార్వో/ రిజిస్ట్రేషన్ కార్యాలయములో మద్యవర్తుల ద్వారా సమర్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ మోసాలకు పాల్పడేవారు. ఈ విధంగా ప్రధాన నిందితులు ఇద్దరు సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డారు. ఈ వ్యవహారంలో భాగస్వాములైన వారికి పది శాతం నుంచి 30శాతం వరకు కమీషన్ చెల్లించేవారు.
{{/usCountry}}ఈ కేసుకు సంబంధించి జనగామ, యాద్రాద్రి జిల్లాల్లో 1,080 పత్రాలకు సంబందించిన లావాదేవీల్లో నిందితులు మోసాలకు పాల్పడ్డారు. అలాగే ఈ రెండు జిల్లాలో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి 22 కేసులు నమోదు కాబడ్డాయి. ఇందులో జనగామ జిల్లాలో 7 కేసులు, యాదాద్రి జిల్లాలో 15 కేసులు నమోదు కాబడ్డాయని వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.