Crime News : వికారాబాద్‌లో మహిళా క్రికెటర్‌ ఆత్మహత్య - ప్రేమ పేరుతో వేధింపులు…?

వికారాబాద్ జిల్లా మధు కాలనీలో 17 ఏళ్ల యువ క్రికెటర్ నందిని ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు యువకుల ప్రేమ వేధింపులే ఆమె మరణానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా…. పోలీసులు మొబైల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Published on: Nov 14, 2026, 10:51:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ రంగంలో రాణించాలని కలలు కంటూ శిక్షణ తీసుకుంటున్న 17 ఏళ్ల యువ క్రీడాకారిణి నందిని ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్ పట్టణంలోని మధు కాలనీలో ఉన్న తన మేనమామ నివాసంలో ఆమె ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో నిత్యం వేధించడం వల్లే తమ బిడ్డ ఈ కఠిన నిర్ణయం తీసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నరు.

వికారాబాద్‌లో మహిళా క్రికెటర్‌ ఆత్మహత్య

Representational Image
వికారాబాద్‌లో మహిళా క్రికెటర్‌ ఆత్మహత్య Representational Image

సెలెక్షన్స్ కోసం శిక్షణ పొందుతూ….

వికారాబాద్‌లోని మధు కాలనీలో ఉండే తన మేనమామ ఇంట్లో ఉంటూ నందిని క్రికెట్ సెలెక్షన్స్ కోసం శిక్షణ తీసుకుంటోంది. అయితే…. కొంతకాలంగా ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో ఆమెను తీవ్రంగా వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి వేధింపులు భరించలేకనే నందిని ఆత్మహత్యకు పాల్పడిందని వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

"మృతురాలిని నందిని (17)గా గుర్తించాం. వికారాబాద్ మధు కాలనీలోని తన మేనమామ ఇంట్లో ఉంటూ సెలెక్షన్స్ కోసం కోచింగ్ తీసుకుంటోంది. ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో వేధించడం వల్లే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మేము ఆమె మొబైల్ ఫోన్‌ను పరిశీలించాం. తదుపరి వివరాల కోసం ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం" అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

కుటుంబ సభ్యుల ఆరోపణల్లోని వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు…. ఈ ఘటనకు దారి తీసిన పూర్తి పరిస్థితులను తెలుసుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More