శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి 24/7 ప్రీమియం టాక్సీ సర్వీస్ ప్రారంభం

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేక ప్రీమియం ఎయిర్‌పోర్ట్ టాక్సీ సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సేవ 24/7 అందుబాటులో ఉంటుంది.

Published on: Jul 23, 2026, 14:26:35 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లోని జీఎంఆర్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు మరింత సురక్షితమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా సేవలను అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఉద్దేశించిన ప్రత్యేక ప్రీమియం ఎయిర్‌పోర్ట్ టాక్సీ సర్వీస్‌నుఅధికారికంగా ప్రారంభించినట్లు ప్రకటించింది.

హైదరాబాద్ విమానాశ్రయం
హైదరాబాద్ విమానాశ్రయం

ఈ ప్రత్యేక టాక్సీ సేవలు సంవత్సరం పొడవునా 24/7 అందుబాటులో ఉంటాయి. రద్దీ సమయాలు లేదా పండుగ రోజుల్లో కూడా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారి ప్రయాణ సమయాలకు అనుగుణంగా నిరంతర రవాణా సౌకర్యాన్ని అందిస్తాయి.

ప్రయాణికులకు ప్రీమియం అనుభూతిని అందించడానికి సెడాన్లు, ఎస్‌యూవీలు కలిపి 200కు పైగా వాహనాలతో కూడిన ప్రత్యేక ఫ్లీట్‌ను కేటాయించారు. ఈ వాహనాలు కేవలం విమానాశ్రయ రవాణా సర్వీసుల కోసమే పనిచేస్తాయి. దీనివల్ల ప్రయాణికులకు సమయపాలన, కచ్చితమైన సేవలు అందుతాయి. విమానాశ్రయం లోపలికి వచ్చే ప్రయాణికులు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ సేవలను పొందవచ్చు. అంతేకాకుండా మొబైల్ యాప్ లేదా బుకింగ్ కియోస్క్‌ల ద్వారా టాక్సీని బుక్ చేసుకుని, నిర్ణీత పికప్ బే వద్ద కేటాయించిన టాక్సీని ఎక్కవచ్చు.

ప్రస్తుతం ఈ ప్రీమియం సర్వీస్ హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాలకు ప్రయాణించడానికి అందుబాటులో ఉంది. ఎయిర్‌పోర్ట్ నిర్దేశించిన కఠిన ప్రమాణాల ప్రకారం ఈ వాహనాలలో పరిశుభ్రత, నైర్మల్యాన్ని మెయింటెన్ చేస్తారు. శిక్షణ పొందిన, సర్టిఫైడ్ డ్రైవర్లు మాత్రమే ఈ వాహనాలను నడుపుతారు.

ఎయిర్‌పోర్ట్ ర్యాంప్‌ల వద్ద నిలిపి ఉంచే వాహనాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. దీనివల్ల ప్రయాణికుల భద్రత, సర్వీస్ క్రమశిక్షణ మరియు ప్రయాణ ప్రక్రియ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగుతుంది. ఈ సందర్భంగా జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సిఈఓ కధిర్ కధిరవన్ మాట్లాడారు.

'మా ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాల్లో ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడమే ప్రాథమిక లక్ష్యం. భద్రత, విశ్వసనీయత మరియు సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రత్యేక ఎయిర్‌పోర్ట్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభించాం. 24/7 లభ్యత, ప్రీమియం వాహనాలు, ధృవీకరించబడిన డ్రైవర్లతో ఒత్తిడి లేని ప్రయాణ అనుభవాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నాం.' అని తెలిపారు.

ఈ కొత్త 24/7 ప్రీమియం టాక్సీ సర్వీస్ రాకతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులకు సేవలు అందించడంలో సరికొత్త మైలురాయిని చేరుకుందని, నగర రవాణా అనుసంధానంలో అగ్రగామిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందని ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More