హైదరాబాద్ నగరంలో కొత్తగా 3 పక్షి జాతులు గుర్తింపు.. మొత్తం సంఖ్య 248కి చేరిక!
హైదరాబాద్ బర్డ్ అట్లాస్ నాలుగో సీజన్‌లో గ్రేటర్ ఫ్లెమింగో, ఎల్లో-ఫూటెడ్ గ్రీన్ పిజియన్, బ్రౌన్-క్యాప్డ్ పిగ్మీ వుడ్‌పెక్కర్ అనే మూడు పక్షి జాతులను హైదరాబాద్ పక్షి జాబితాలో చేర్చారు. దీంతో నగరంలో నమోదైన మొత్తం పక్షి జాతుల సంఖ్య 248కి చేరింది.
హైదరాబాద్‌లో పక్షుల సంరక్షణ, నగర జీవవైవిధ్యంపై అధ్యయనం ముమ్మరంగా సాగుతోంది. తాజాగా ముగిసిన హైదరాబాద్ బర్డ్ అట్లాస్(HBA) నాల్గో విడత సర్వేలో మరొక మూడు కొత్త పక్షి జాతులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇప్పటివరకు రాజధాని నగరంలో నమోదైన మొత్తం పక్షి జాతుల సంఖ్య 248కి చేరింది.

వరల్డ్ వైడ్‌ఫండ్ ఫర్ నేచర్-ఇండియా, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్, దక్కన్ బర్డర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సిటిజన్ సైన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. జూలై 4న ప్రారంభమై 22 రోజుల పాటు జరిగిన ఈ సర్వేలో 200 మందికి పైగా వాలంటీర్లు పాల్గొన్నారు.
ఈ నాలుగో సీజన్ సర్వేలో గ్రేటర్ ఫ్లెమింగో, ఎల్లో-ఫుటెడ్ గ్రీన్ పిజియన్, బ్రౌన్-క్యాప్డ్ పిగ్మీ వుడ్‌పెక్కర్ అనే మూడు కొత్త జాతులను గుర్తించారు. వాలంటీర్లు మొత్తం 1,250 గంటలకు పైగా శ్రమించారు. ఇది గత మూడో సీజన్‌తో పోలిస్తే 44 శాతం పెరుగుదల కావడం విశేషం.
ఈ విడత సర్వేలో భాగస్వాములు మొత్తం 158 పక్షి జాతులను, 75,000 పైగా పక్షులను రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ సమాచారాన్ని డేటా రివ్యూ టీమ్ పరిశీలిస్తోందని, తుది సంఖ్యలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ సర్వే సమాచారం హైదరాబాద్ నగర పరిసరాల్లోని పక్షుల విస్తరణ, కాలాల వారీగా వాటి రాకపోకలను అర్థం చేసుకోవడానికి, పట్టణ జీవవైవిధ్య ప్రణాళికలకు ఎంతో ఉపయోగపడుతుందని హైదరాబాద్ బర్డ్ అట్లాస్ తెలిపింది.
ఈ ప్రాజెక్ట్‌ను ఫిబ్రవరి 2025లో ప్రారంభించారు. ప్రతి ఏటా ఫిబ్రవరి, జూలై నెలల్లో ఈ సర్వే నిర్వహిస్తారు. తాజాగా నాలుగో విడత సర్వే చేశారు. ప్రాజెక్ట్ మూడో ఏడాదిలో భాగంగా ఐదో విడత సర్వేను ఫిబ్రవరి 2027లో, ఆరో విడతను జూలై 2027లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


