హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ అడ్మిషన్స్

హైదరాబాద్ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఐదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ డిగ్రీ కోర్సులో ప్రవేశాల కోసం అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానించింది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 7 ఆగస్టు 2026గా నిర్ణయించారు.

Published on: Jul 27, 2026, 20:30:59 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో ఒకటైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(UoH) 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఐదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ డిగ్రీ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది. కంటి వైద్య రంగంలో ప్రొఫెషనల్‌గా స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఇది చక్కని అవకాశం.

హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ ప్రవేశాలు
హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ ప్రవేశాలు

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2026) రాసిన అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రాథమిక నిబంధనలు, అర్హత ప్రమాణాలు, నీట్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా మాత్రమే అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ కోర్సులో మొత్తం 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

యూనివర్సిటీ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 12 సీట్లు, ఓబీసీ అభ్యర్థులకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ఈడబ్ల్యూఎస్ వర్గానికి 3 సీట్లు కేటాయించారు. దివ్యాంగులు, డిఫెన్స్ కేటగిరీలకు కూడా నియమావళి ప్రకారం అవకాశాలు ఉంటాయి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 07 ఆగస్టు 2026గా ఉంది. ప్రాథమిక సెలెక్షన్, వెయిటింగ్ లిస్ట్ విడుదల 12 ఆగస్టు 2026న చేస్తారు. 21 ఆగస్టు 2026న కౌన్సెలింగ్, ధ్రువపత్రాల పరిశీలన, రిపోర్టింగ్ చేయాలి.

జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.300గా దరఖాస్తు ఫీజు ఉంది. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (OBC-NCL) అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.125గా నిర్ణయించారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు అడ్మిషన్ నిబంధనలు, కోర్సు వివరాలు, ఫీజుల పట్టిక, సీట్ల కేటాయింపు, విశ్వవిద్యాలయ రిజర్వేషన్ విధానాల సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు. దరఖాస్తు ఫారాలు, ఇతర మార్గదర్శకాలు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి:

అధికారిక వెబ్‌సైట్లు: acad.uohyd.ac.in, www.uohyd.ac.in

ఆన్‌లైన్ ఫీజు చెల్లించిన తర్వాత జనరేట్ అయ్యే అప్లికేషన్ లేదా ఫారమ్ నంబర్‌ను భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తుదారులు భద్రపరుచుకోవాలి. సమయం తక్కువగా ఉన్నందున అర్హులైన అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More