Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ న్యూస్.. 60 కొత్త కోచ్‌లతో 10 రైళ్లు
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోకు మరిన్ని కోచ్‌లు రానున్నాయి. 60 కొత్త కోచ్‌లను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీనిద్వారా కొత్తగా 10 రైళ్లు నడవనున్నాయి.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు త్వరలోనే మరిన్ని మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు, భవిష్యత్ అవసరాలను తీర్చేందుకు గాను మెట్రో నెట్‌వర్క్‌కు కొత్తగా 60 కోచ్‌లను జోడించేందుకు హైదరాబాద్ మెట్రో సిద్ధమైంది.

సుమారు రూ. 923.62 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం డిజైన్, తయారీ, సరఫరా, నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో బిడ్డర్ల నుంచి టెండర్లను ఆహ్వానించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(HMRL) తరఫున ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు తెలంగాణ ప్రభుత్వం నిధులు సమకూరుస్తుండగా, హెచ్‌ఎంఆర్‌ఎల్ ప్రాజెక్ట్ యజమానిగా ఉంటుంది.
జనవరి 13, 2027 వరకు బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. 15 సంవత్సరాల పాటు కోచ్‌లు, డిపో పరికరాలు, సంబంధిత యంత్రాల సమగ్ర నిర్వహణ కోసం బిడ్లను ఆహ్వానిస్తూ.. టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. డిజైన్, తయారీ, టెస్టింగ్, కమిషనింగ్ పూర్తి చేయడానికి 125 వారాల సమయం కేటాయించారు.
కాంట్రాక్ట్ పొందిన సంస్థ కొత్త కోచ్‌ల డిజైన్, తయారీ, సరఫరా, టెస్టింగ్, కమీషనింగ్‌తో పాటు మెట్రో సిబ్బందికి అవసరమైన శిక్షణను ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త కోచ్‌లకు మద్దతుగా డిపోలోని యంత్రాలు, టెస్టింగ్ పరికరాలు, ప్రత్యేక పరికరాల మెయింటెనెన్స్‌ను కూడా 15 ఏళ్ల పాటు నిర్వహించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం రద్దీ సమయాల్లో మెట్రో రైళ్లలో విపరీతమైన తోపులాట ఎదుర్కొంటున్న ప్రయాణికులకు ఈ కొత్త కోచ్‌ల రాక పెద్ద ఊరటనివ్వనుంది. కొత్త కోచ్‌లు అందుబాటులోకి వస్తే రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరగడమే కాకుండా ప్రయాణికుల సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతుంది. అయితే ఈ కొత్త కోచ్‌లను ఏ రూట్లలో నడుపుతారు, ఏ తేదీ నుండి అందుబాటులోకి తెస్తారు అనేది ప్రాజెక్ట్ పురోగతి ఆధారంగా అధికారులు ప్రకటించనున్నారు. ఈ 60 కొత్త కోచ్‌లు వస్తే అదనంగా మరో 10 కొత్త రైళ్లను నడపవచ్చు. ఒక్కోటి 6 కోచ్‌లతో ఉంటుంది
ఒకవైపు కొత్త కోచ్‌ల కొనుగోలు ప్రక్రియ సాగుతుండగా, మరోవైపు నగరంలో మెట్రో నెట్‌వర్క్ విస్తరణకు హెచ్‌ఎంఆర్‌ఎల్ వేగంగా అడుగులు వేస్తోంది. పాతబస్తీ కారిడార్ దారుల్షిఫా - చంద్రాయణగుట్ట మధ్య 7.5 కి.మీ కారిడార్ రోడ్డు వెడల్పు పనులను అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డి ఇటీవల సమీక్షించారు. 888 ఆస్తుల్లో ఇప్పటికే 833 ఆస్తుల భూసేకరణ పూర్తయింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


