దసరా గిఫ్ట్.. హైదరాబాద్ మెట్రో-టీజీఎస్ఆర్టీసీ కామన్ మొబిలిటీ కార్డ్ ధరలు తగ్గింపు!

హైదరాబాద్ మెట్రో-టీజీఎస్ఆర్టీసీ సేవలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కామన్ మెుబిలిటీ కార్డును ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్డు ధరలను తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

Published on: Oct 12, 2026, 14:22:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు మెట్రో-ఆర్టీసీ సేవల కోసం కామన్ పాస్‌ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే హైదరాబాద్ మెట్రో-టీజీఎస్ఆర్టీసీ సేవల కోసం ఉద్దేశించిన కామన్ మొబిలిటీ కార్డ్(Common Mobility Card) ధరలను పునఃపరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల నుండి వచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో, క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలను పరిశీలిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

హైదరాబాద్ మెట్రో-టీజీఎస్ఆర్టీసీ కామన్ పాస్
హైదరాబాద్ మెట్రో-టీజీఎస్ఆర్టీసీ కామన్ పాస్

హైదరాబాద్ మెట్రో రైలు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బస్సులలో ప్రయాణించడానికి వీలుగా ఈ కామన్ మొబిలిటీ కార్డ్ అక్టోబర్ 2, 2026న ప్రారంభించారు. దీని నెలవారీ పాస్ ధర రూ.8,500(ఇందులో హైదరాబాద్ మెట్రో వాటా రూ.7,000, ఆర్టీసీ వాటా రూ.1,500 ఉన్నాయి). అలాగే రోజువారీ పాస్ ధర రూ.400 (ఇందులో హైదరాబాద్ మెట్రో వాటా రూ.300, టీజీఎస్ఆర్టీసీ వాటా రూ.100 ఉన్నాయి). ఈ కార్డును ప్రవేశపెట్టిన వెంటనే.. దీని ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది.

ఈ పాస్‌లో మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్(MMTS)తో పాటు, షేర్డ్ ఆటోలు, ఇతర రవాణా మార్గాల ద్వారా లభించే లాస్ట్-మైల్ కనెక్టివిటీ వంటివి చేర్చలేదని కూడా కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అధిక ధరలతో ప్రజలపై భారం మోపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రవాణా శాఖ మంత్రి స్పష్టం చేశారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. తుది నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

ఈ కామన్ పాస్ ఉంటే.. మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. వీటిద్వారా హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రోలో ఎక్కడి నుంచైనా వెళ్లవచ్చు. ప్రస్తుతం ఉన్న రేట్లు అధికంగా ఉన్నట్టుగా అభిప్రాయాలు వస్తున్నాయి. అందుకే పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించడం లేదంటున్నారు దీంతో ప్రభుత్వం కామన్ మెుబిలిటీ పాస్ ధరలను తగ్గించనుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More