...
...
Next Story

సిద్ధిపేట జిల్లాలో బాలికపై దారుణం - పోక్సో కేసులో ముగ్గురు మైనర్లు సహా ఏడుగురి అరెస్ట్

సిద్ధిపేట జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ముగ్గురు మైనర్లు ఉన్నారు.

Published on: Oct 24, 2026, 12:55:41 IST
Advertisement

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో దారుణ సంఘటన వెలుగు చూసింది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు మైనర్లు సహా మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోక్సో కేసులో ముగ్గురు మైనర్లు సహా ఏడుగురి అరెస్ట్ (Pixel image)
పోక్సో కేసులో ముగ్గురు మైనర్లు సహా ఏడుగురి అరెస్ట్ (Pixel image)

సిద్ధిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలోని మద్దూరు పోలీస్ స్టేషన్ సరిహద్దుల్లో ఈ ఘటనపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైంది. సమాచారం అందుకున్న మద్దూరు పోలీసులు…. నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నారు.

ఏం జరిగిందంటే..?

దసరా పండుగ రోజున బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను గమనించిన నిందితులు…. ఆమెను కిడ్నాప్ చేసి సమీపంలోని మరో గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. మరుసటి రోజు(అక్టోబర్ 21) ఉదయం బాధితురాలిని ఆమె గ్రామ సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించడంతో…. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే గతంలోనూ సదరు బాలికను వేధించినట్లు సమాచారం. బాలికకు సంబంధించిన ఫొటోలు, వీడియో లు తీసి నిందితులు ఈ అఘాయిత్యాలకు ఒడి గట్టుతున్నట్లు తెలిసింది…! ఈ క్రమంలోనే ఈ దారుణం గురించి… ఇంటి పెద్దలకు తెలియటంతో పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు… అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులోని నిందితులందర్నీ అరెస్ట్ చేశారు.

అనంతరం వారిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అరెస్టు చేసిన నిందితులకు వెంటనే ర్యాపిడ్ డ్రగ్ టెస్టులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ పరీక్షల్లో నిందితులందరికీ డ్రగ్స్ నెగెటివ్ అని నివేదిక వచ్చిందని స్పష్టం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks