KGBVs In Telangana : తెలంగాణలో 736 కేజీబీవీలకు అనుమతి.. కేంద్ర విద్యాశాఖ మంత్రి

KGBVs In Telangana : తెలంగాణకు మొత్తం 736 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు (కేజీబీవీలకు) ఆమోదం తెలిపినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. 26 కేజీబీవీలను మెదక్ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు.

Published on: Aug 10, 2026, 18:21:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సమగ్ర శిక్షా అభియాన్ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 736 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV) మంజూరైనట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ 736 పాఠశాలల్లో ఒక్క మెదక్ జిల్లాలోనే 26 కేజీబీవీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

కేజీబీవీ
కేజీబీవీ

తెలంగాణలో సర్వశిక్షా అభియాన్, సమగ్ర శిక్ష పథకాల నిధుల వినియోగంపై మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు రాతపూర్వక సమాధానమిచ్చారు.

కేజీబీవీలతో పాటు పాఠశాల విద్యకు సంబంధించిన పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని మంత్రి తెలిపారు. రాజ్యాంగం ప్రకారం విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ, మెజారిటీ పాఠశాలలు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రత్యక్ష నిర్వహణలోనే పనిచేస్తాయని గుర్తుచేశారు.

స్థానిక అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు వార్షిక ప్రణాళిక, బడ్జెట్‌ను సిద్ధం చేస్తాయని మంత్రి వివరించారు. ఈ ప్రణాళికలను ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు సమగ్రంగా పరిశీలించి, పథకం మార్గదర్శకాలు, బడ్జెట్ కేటాయింపులకు లోబడి ఆమోదం తెలుపుతుందని స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ (PM POSHAN) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ప్రహ్లాద్ జోషి తెలిపారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఆధారిత పాఠశాలల్లో బాల్‌వాటిక నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వేడివేడిగా, పౌష్టికాహారాన్ని అందించే పూర్తి బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని పేర్కొన్నారు.

పాఠశాలల్లో ఎప్పటికప్పుడు ఆహార భద్రత, పరిశుభ్రత, పారిశుధ్య తనిఖీలు నిర్వహించడంతో పాటు వంటవారికి, సహాయకులకు శిక్షణ, సామర్థ్య పెంపు కార్యక్రమాలు చేపడుతోందని కేంద్రమంత్రి తెలిపారు. పీఎం పోషణ్ కింద సకాలంలో ఆహార ధాన్యాల సరఫరా, వంట ఖర్చులను భరిస్తున్నామని, అలాగే పీఎం పోషణ్ ఎంఐఎస్, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More