తెలంగాణ నూతన ఆవిష్కరణల వేదిక, భారతదేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇన్నోవేషన్ హబ్ అయిన టీ-హబ్ (T-Hub) మరో కీలక ఈవెంట్ జరగనుంది. నవంబర్ 16న ఇజ్రాయెల్‌కు చెందిన 20 ప్రముఖ టెక్నాలజీ కంపెనీల ప్రతినిధి బృందానికి టీ-హబ్ ఆతిథ్యం ఇవ్వనుంది. విదేశీ సాంకేతికతతో స్థానిక బిజెనెస్‌లను అనుసంధానించడం, కొత్త భాగస్వామ్యాలు, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణలోని స్థానిక స్టార్టప్‌లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు ఈ ఈవెంట్‌లో పాల్గొని ఇజ్రాయెల్ కంపెనీలతో భాగస్వామ్యం వహించాలని టీ-హబ్ పిలుపునిచ్చింది. సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచే ఇజ్రాయెల్ నుంచి వస్తున్న ఈ 20 కంపెనీలు భవిష్యత్ సాంకేతికతలకు సంబంధించిన పలు కీలక విభాగాలలో పనిచేస్తున్నాయి.
డిఫెన్స్ టెక్‌లో భాగంగా రక్షణ రంగ సాంకేతికతలు, ఆధునిక ఆయుధ నియంత్రణ వ్యవస్థలు, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా ప్రొటెక్షన్ సొల్యూషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌లు, ఆటోమేషన్, సెమీకండక్టర్లు, డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్ పరిజ్ఞానంలో ఈ కంపెనీలు పని చేస్తాయి.
ఈ మెగా ఈవెంట్‌ను తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ, దక్షిణ భారతదేశంలోని ఇజ్రాయెల్ ఎకనామిక్ మిషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సులో పాల్గొనడానికి, అలాగే హైదరాబాద్ వచ్చే ఇజ్రాయెల్ కంపెనీల పూర్తి కేటలాగ్‌ను పరిశీలించడానికి ఆసక్తి ఉన్న స్థానిక సంస్థలు టీ-హబ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ నమూనాలో 2015లో నాన్-ప్రాఫిట్ సంస్థగా టీ-హబ్ ప్రారంభమైంది. టి-హబ్ అనేది భారతదేశపు అతిపెద్ద స్టార్టప్ హబ్. ఇది వ్యవస్థాపకులకు మద్దతు ఇవ్వడానికి స్టార్టప్‌లు, కార్పొరేట్‌లు, విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, పెట్టుబడిదారులు, ప్రపంచ మార్కెట్‌లను ఒకచోట చేర్చుతుంది.
టీ-హబ్ కేవలం స్థానిక స్టార్టప్‌లకు నిధులు, స్థలం కేటాయించడమే కాకుండా.. కార్పొరేట్ దిగ్గజాలు, పరిశోధనా సంస్థలు, వెంచర్ క్యాపిటలిస్టులు, విదేశీ మార్కెట్‌లను భారతీయ ఆవిష్కర్తలకు అనుసంధానించే బ్రిడ్జిలగా పనిచేస్తోంది.
{{/usCountry}}టీ-హబ్ కేవలం స్థానిక స్టార్టప్‌లకు నిధులు, స్థలం కేటాయించడమే కాకుండా.. కార్పొరేట్ దిగ్గజాలు, పరిశోధనా సంస్థలు, వెంచర్ క్యాపిటలిస్టులు, విదేశీ మార్కెట్‌లను భారతీయ ఆవిష్కర్తలకు అనుసంధానించే బ్రిడ్జిలగా పనిచేస్తోంది.
{{/usCountry}}స్టార్టప్ నేషన్‌గా పేరుగాంచిన ఇజ్రాయెల్ టెక్నాలజీ, గ్లోబల్ ఐటీ హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్ భాగస్వామ్యం వల్ల తెలంగాణలోని నూతన ఆవిష్కర్తలకు గ్లోబల్ ఎక్స్‌పోజర్ లభించడమే కాకుండా నగరంలో కొత్త ఉద్యోగాల కల్పన వేగవంతం కానుంది.