స్టార్టప్‌లకు బిగ్ ఛాన్స్.. హైదరాబాద్ టీ-హబ్‌కు 20 ఇజ్రాయెల్ టెక్ కంపెనీల రాక!

తెలంగాణలోని టి-హబ్ నవంబర్ 16న 20 ఇజ్రాయెల్ టెక్ కంపెనీల ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇవ్వనుంది. స్థానిక స్టార్టప్‌లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

Published on: Nov 5, 2026, 17:14:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణ నూతన ఆవిష్కరణల వేదిక, భారతదేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇన్నోవేషన్ హబ్ అయిన టీ-హబ్ (T-Hub) మరో కీలక ఈవెంట్ జరగనుంది. నవంబర్ 16న ఇజ్రాయెల్‌కు చెందిన 20 ప్రముఖ టెక్నాలజీ కంపెనీల ప్రతినిధి బృందానికి టీ-హబ్ ఆతిథ్యం ఇవ్వనుంది. విదేశీ సాంకేతికతతో స్థానిక బిజెనెస్‌లను అనుసంధానించడం, కొత్త భాగస్వామ్యాలు, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ టీ-హబ్‌కు ఇజ్రాయెల్ కంపెనీలు
హైదరాబాద్ టీ-హబ్‌కు ఇజ్రాయెల్ కంపెనీలు

ఈ సందర్భంగా తెలంగాణలోని స్థానిక స్టార్టప్‌లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు ఈ ఈవెంట్‌లో పాల్గొని ఇజ్రాయెల్ కంపెనీలతో భాగస్వామ్యం వహించాలని టీ-హబ్ పిలుపునిచ్చింది. సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచే ఇజ్రాయెల్ నుంచి వస్తున్న ఈ 20 కంపెనీలు భవిష్యత్ సాంకేతికతలకు సంబంధించిన పలు కీలక విభాగాలలో పనిచేస్తున్నాయి.

డిఫెన్స్ టెక్‌లో భాగంగా రక్షణ రంగ సాంకేతికతలు, ఆధునిక ఆయుధ నియంత్రణ వ్యవస్థలు, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా ప్రొటెక్షన్ సొల్యూషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌లు, ఆటోమేషన్, సెమీకండక్టర్లు, డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్ పరిజ్ఞానంలో ఈ కంపెనీలు పని చేస్తాయి.

ఈ మెగా ఈవెంట్‌ను తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ, దక్షిణ భారతదేశంలోని ఇజ్రాయెల్ ఎకనామిక్ మిషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సులో పాల్గొనడానికి, అలాగే హైదరాబాద్ వచ్చే ఇజ్రాయెల్ కంపెనీల పూర్తి కేటలాగ్‌ను పరిశీలించడానికి ఆసక్తి ఉన్న స్థానిక సంస్థలు టీ-హబ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ నమూనాలో 2015లో నాన్-ప్రాఫిట్ సంస్థగా టీ-హబ్ ప్రారంభమైంది. టి-హబ్ అనేది భారతదేశపు అతిపెద్ద స్టార్టప్ హబ్. ఇది వ్యవస్థాపకులకు మద్దతు ఇవ్వడానికి స్టార్టప్‌లు, కార్పొరేట్‌లు, విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, పెట్టుబడిదారులు, ప్రపంచ మార్కెట్‌లను ఒకచోట చేర్చుతుంది.

టీ-హబ్ కేవలం స్థానిక స్టార్టప్‌లకు నిధులు, స్థలం కేటాయించడమే కాకుండా.. కార్పొరేట్ దిగ్గజాలు, పరిశోధనా సంస్థలు, వెంచర్ క్యాపిటలిస్టులు, విదేశీ మార్కెట్లను భారతీయ ఆవిష్కర్తలకు అనుసంధానించే బ్రిడ్జిలగా పనిచేస్తోంది.

స్టార్టప్ నేషన్‌గా పేరుగాంచిన ఇజ్రాయెల్ టెక్నాలజీ, గ్లోబల్ ఐటీ హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్ భాగస్వామ్యం వల్ల తెలంగాణలోని నూతన ఆవిష్కర్తలకు గ్లోబల్ ఎక్స్‌పోజర్ లభించడమే కాకుండా నగరంలో కొత్త ఉద్యోగాల కల్పన వేగవంతం కానుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More